శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 27 నవంబరు 2017 (17:28 IST)

పద్మావతిని అతను స్వయంగా చూశాడా? కర్ణిసేన వక్రీకరిస్తుందా? బాలీవుడ్ సపోర్ట్

పద్మావతి సినిమాకు మద్దతు ప్రకటించేందుకు బాలీవుడ్ ఒక్కటైంది. బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పద్మావతి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి మద్దతు ప్రకటించారు. కర్ణిసేన, రాజ్‌పుత్ గ్రూపుల బెదిరింపులు

పద్మావతి సినిమాకు మద్దతు ప్రకటించేందుకు బాలీవుడ్ ఒక్కటైంది. బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పద్మావతి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి మద్దతు ప్రకటించారు. కర్ణిసేన, రాజ్‌పుత్ గ్రూపుల బెదిరింపులు చూస్తుంటే.. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగక తప్పదని బాలీవుడ్ ప్రముఖులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
26/11 ఉగ్రదాడుల బాధితులను స్మరించుకున్న వేళ ఒక్కటైన బాలీవుడ్ ప్రముఖులు పద్మావతికి తామున్నామంటూ ముందుకొచ్చారు. మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనానికి దారితీసిన పద్మావతి అంశంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఇండియన్ ఫిలింస్ అండ్ టీవీ డైరెక్టర్స్ అసోసియేషన్(ఐఎఫ్‌టీడీఏ) అధ్యక్షుడు అశోక్ పండిట్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పద్మావతి విషయంలో తమ బాధ్యతల గురించి ఇంకెవరో తమకు గుర్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. సినిమాలని తెరకెక్కించడంలో తాము బాధ్యతయుతంగానే వ్యవహరిస్తున్నామన్నారు.
 
ఇకపోతే.. చిత్తోర్ గఢ్ కోటలోని పద్మినీ మహల్‌ ముందు వున్న ఓ పురాతన శిలా పలకాన్ని ఆర్కియాలజీ విభాగం అధికారులు మూతవేశారు. ఈ శిలాఫలకంలో మొగల్ రాజు అల్లాఉద్దీన్ ఖిల్జీ, స్వయంగా రాణి పద్మావతిని చూశాడని ఉంది. ఈ విషయం హింసాత్మక ఘటనలు జరగవచ్చుననే అనుమానంతో ఈ ఫలకాన్ని మూతవేశారు. కర్ణిసేనలోని కొందరు చరిత్రను వక్రీకరించాలని చూస్తున్నారని ఆర్కియాలజీ అధికారి ఒకరు ఆరోపించారు.