1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 జనవరి 2021 (17:21 IST)

దేవాలయం వెనుక భాగాన్ని అద్ది నమస్కరిస్తున్నారా?

ఆలయానికి వెళ్తున్నారా..? అయితే ఈ కథనం చదవండి. గుడిలో వుండేటప్పుడు గట్టిగా అరవటం, నవ్వటం, ఐహిక విషయాల గురించి మాట్లాడటం చేయకూడదు. గుడి పరిసరాలను పరిశుభ్రంగా వుంచాలి. కొబ్బరి పెంకులూ, అరటి తొక్కలు ఆలయంలో వున్న చెత్త కుండీల్లోనే వేయాలి. అలాగే దర్శనానికి తోసుకుంటూ లేదా ముందున్నవారి అధిగమిస్తూ దర్శనం చేసుకోరాదు. భగవంతుడిని కనులారా వీక్షించాలి. 
 
దేవాలయంలో నిల్చుని తీర్థం పుచ్చుకోవాలి. గృహంలో కూర్చుని తీర్థం పుచ్చుకోవాలి. దీపారాధన శివునికి ఎడమవైపు, శ్రీ మహావిష్ణువుకు కుడి వైపు చేయాలి. అమ్మవారికి నూనె దీపమైతే ఎడమవైపు, ఆవునేతి దీపమైతే కుడి వైపు వెలిగించాలి. చాలా మంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు దేవాలయం వెనుక భాగాన్ని అద్ది నమస్కరిస్తుంటారు. అలా చేయకూడదు. ఆ భాగంలో రాక్షసులుంటారు. అలాగే ఆలయానికి గజం దూరం నుంచి ప్రదక్షణ చేయాలి. 
 
గుడిలో ప్రదక్షిణల పద్ధతి..?
ధ్వజస్థంభం నుంచి మళ్లీ ధ్వజస్థంభం వరకూ చేస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. అలాగే మందిరమైతే ముఖద్వారం వద్ద నుంచి ప్రారంభించి మళ్లీ మందిర ముఖ ద్వారం వద్దకు వస్తే ఒక ప్రదక్షిణ పూర్తి అయినట్లు. హనుమంతుడికి ఐదు, ఏదైనా కోర్కె వుంటే 11, 27, 54, 108 సంఖ్యలతో ప్రదక్షిణం చేస్తే ఫలితం వుంటుంది. నవగ్రహాలకు 3సార్లు లేదా తొమ్మిది సార్లు చేయవచ్చు. అలాగే 11, 21, 27 సార్లు బేసి సంఖ్యలో చేయవచ్చు.