సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

దీపం పంచభూతాల కలయిక.. ఎలాగంటే?

దీపం పంచభూతాల కలయిక. ఎలాగంటే ప్రమిదపు మట్టి భూమిగాను నూనె నీరుగాను, అగ్నిజ్వాల నిప్పు గాను, దీపం వెలగడానికి కారణమైన ఆక్సిజన్ గాలి గాను దీపపు కాంతిని ప్రసరింపజేసేది ఆకాశంగాను ఇలా పంచభూతాలు దీపంలో ఉన్నాయి.

అందుకే దీపం వెలిగించి పంచభూతాల నవగ్రహ కలయికతో అష్టైశ్వర్యాలు పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
దీపపు ప్రమిద సూర్యుడు 
నూనె అంశం చంద్రుడు 
దీపం వత్తి బుద్ధుని అంశం, 
వెలిగే దీపం నిప్పు కుజుని అంశం 
దీపం జ్వాలలో ఉండే పసుపు రంగు గురువు 
దీపం నీడ రాహువు  
దీపం నుంచి వెలువడే కిరణాలే శుక్రుడు 
దీపం వెలిగించడం వల్ల పొందే మోక్షమే కేతు 
దీపం కొండెక్కిన తర్వాత మాడిన నలుపు రంగె శనిగా పరిగణిస్తారు.