శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (17:50 IST)

పాము అడ్డు వస్తే.. తాబేలు ఇంట్లోకి ప్రవేశిస్తే మంచిదా?!

తాబేలు ఇంట్లోకి ప్రవేశించడం అరిష్టమని, దుశకునమని అందరూ భావిస్తుంటారు. ఆలయాల్లో తాబేలుతో కూడిన బొమ్మలు పూజలందుకోవడం.. విదేశాల్లో నక్షత్ర తాబేళ్లను చేపల తరహాలో ఇంట్లోనే పెంచుకోవడం చూస్తుంటాం. తాబేళ్లను ఇంట్లో వాస్తు ప్రకారం అక్వేరియంలా సిద్ధం చేసుకుని పెంచుకోవచ్చు. ఇంట్లో పెంచేందుకు తామే తాబేళ్లను తెచ్చుకుంటే పర్లేదని.. అయితే అదే తాబేలు తానంతట తాను ఏ ఇంట్లోకైనా వెళ్తే మాత్రం అరిష్టమని, జరగబోయే అపశకునాన్ని ముందే చెప్పేందుకే అది వచ్చిందనుకోవాలని పంచాంగ నిపుణులు అంటున్నారు. 
 
ఎక్కడికైనా ప్రయాణిస్తున్నప్పుడు పాము అడ్డుగా వస్తే ఆ కార్యం దిగ్విజయం కాదని ప్రతీతి. అయితే ప్రయాణంలో అడ్డుపడిందనే కోపంతో పామును కొట్టడం కానీ చేయకూడదు. దారిన పోతున్నప్పుడు విషం (నాగుపాము) అడ్డొస్తే అపశకునాన్ని ముందే చెప్పడం ద్వారా ఏం చేద్దామని ఆలోచనపై దృష్టి మరలించాలని.. అప్రమత్తంగా వ్యవహరించాలని పంచాంగ నిపుణులు అంటున్నారు.  
 
ఇక తాబేలు శకునానికి వస్తే..? విష్ణు భగవానుడి దశావతారంలో ఒకటైన కూర్మావతారం గురించి తెలిసిందే. ఈ కూర్మావతారం తాబేలును సూచిస్తుంది. తనకు తానే రక్షణ కవచంగా ఉండే తాబేలు.. పంచేంద్రియాలను నిగ్రహించుకుని జీవించాలనే విషయాన్ని సూచిస్తుందని పంచాంగ నిపుణులు అంటున్నారు. అయితే పంచాంగం ప్రకారం తాబేలు తన కవచంలో తన శరీరాన్ని కృశించుకునేట్లు చేసుకునే తరహాలో ఐశ్వర్యాలు తరిగిపోవడం జరుగుతాయి. అందుకే తాబేలు ఇంట్లోకి తానంతట అదే రాకూడదని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు. 
 
తాబేలు ఇంట్లో అడుగుపెడితే.. ఆ ఇంట నుంచి దూరంగా వెళ్ళిపోమని, ఆపద వెతుక్కుంటూ వస్తుందని అర్థం చేసుకోవాలి. అదే ఇంట వుంటే సమస్యలెక్కువని చెప్తున్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తాబేలు ఇంట్లో రావడాన్ని చెడు శకునంగా తీసుకోకుండా ఇబ్బందులు రావడానికి ముందే హెచ్చరించేందుకు వచ్చినట్లు భావించి ముందుకు వెళ్తుండాలని పంచాంగ నిపుణులు సలహా ఇస్తున్నారు.