గురువారం, 21 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 నవంబరు 2024 (07:56 IST)

పంచమి తిథి.. వారాహి దేవిని పూజిస్తే అంతా శుభమే.. సమయం?

Godess Varahi
కార్యసిద్ధి కోసం వరాహి దేవిని పంచమి తిథి నాడు పూజించడం ఉత్తమం. పంచమి తిథిలో వరాహి దేవి స్తుతితో అనుకున్న కోరికలు తీరుతాయి. ఆ రోజున వ్రతమాచరించి పూజిస్తే.. రుణబాధలుండవు. ఆర్థిక సమస్యలుండవు. వయోబేధం లేకుండా పంచమి తిథి రోజున వరాహి దేవి కోసం వ్రతమాచరించవచ్చు. 
 
పంచమి తిథిలో జన్మించిన జాతకులు పుట్టకు పాలు పోయడం.. వరాహి దేవిని పూజించడం ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. ఇంకా ఐదు నూనెలను కలగలిపి.. ఆమెకు దీపం వెలిగిస్తే సకలసంపదలు వెల్లివిరుస్తాయి. ఈ దీపానికి ఎరుపు వత్తులను వాడటం మంచిది. 
 
నైవేద్యంగా పొట్టు తీయని మినపప్పుతో తయారు చేసిన గారెలు లేకుంటే నవధాన్యాలతో చేసిన గారెలను, పెరుగన్నం, శెనగలు, పానకం వంటివి సమర్పించవచ్చు. వారాహి దేవిని పూజించే వారికి సర్వం సిద్ధిస్తుంది. పంచమి రోజున రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఆమెను పూజించవచ్చు. ఇంకా పంచముఖ దీపాన్ని వారాహికి వెలిగించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.