శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2017 (14:04 IST)

అశ్లీల వీడియోలు చూసినా దోషమే.. కామంతో శరీరం వేడెక్కితే?

స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో పాటు.. ఉచిత డేటా వంటి ఇంటర్నెట్ సదుపాయాలు సులువుగా లభించడంతో.. అశ్లీల వీడియోలు చూసే వారి సంఖ్య పెరిగిపోతోంది. అశ్లీల ఫోటోలు, అశ్లీల వీడియో, కామోద్ధీపనకు కారణమయ్యే దృశ్యాలను చూడ

స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో పాటు.. ఉచిత డేటా వంటి ఇంటర్నెట్ సదుపాయాలు సులువుగా లభించడంతో.. అశ్లీల వీడియోలు చూసే వారి సంఖ్య పెరిగిపోతోంది. అశ్లీల ఫోటోలు, అశ్లీల వీడియో, కామోద్ధీపనకు కారణమయ్యే దృశ్యాలను చూడటం ద్వారా ఆధ్యాత్మిక, పంచాంగ ప్రకారం దోషం ఏర్పడుతుందట. అశ్లీల వీడియోలను.. చూడరాని దృశ్యాలను చూడటం ద్వారా కామంతో శరీరం వేడెక్కుతుంది. 
 
ఈ వేడి పిత్త నాడీలపై ప్రభావం చూపుతుంది. తద్వారా పలు వ్యాధులకు కారణమవుతుంది. ఇంకా ఈ విధానం వంజిత దోషానికి కారణం అవుతుంది. ఇలా అనవసరమైన వీడియోలను చూసేవారు.. ఈ దోషానికి బంధీలు కాకతప్పదని.. అందుకే వీరు సహోదరులకు తగిన మర్యాదలు చేయడం.. వారికి సహకరించడం చేయాలి. సోదరులు లేని వారు పేద మహిళలకు దానం చేస్తే ఈ దోషం నివృత్తి అవుతుందని పంచాంగ నిపుణులు అంటున్నారు. 
 
ఈ విధంగానే మరో నాలుగు దోషాల కారణంగా మానవులు ఇబ్బంది పడక తప్పదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇందులో పైన పేర్కొనబడిన వంజిత దోషం ప్రథమమైనది కాగా, రెండోది బంధ దోషం, మూడోది కల్పిత దోషం, నాలుగోది వంతుల్క దోషం, చివరిది ప్రణకాల దోషం. ఈ దోషాలు కలియుగంలో ఎక్కువైపోతున్నాయని.. ఈ దోషాల నుంచి నివృత్తి చేసుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. 
 
2. బంధ దోషం : 
మనల్ని నమ్మిన వారికి ద్రోహం చేయడం ఈ దోషం కింద వస్తుంది. ఈ దోషం నివృత్తి కావాలంటే మామయ్య, అత్తమ్మ, పిన్ని కుమార్తెలకు దానం చేయడం మంచిది. 
 
3. కల్పిత దోషం : 
ఇతరులు తనను ప్రేమిస్తున్నారని భావించి.. వారితో వావివరుసలు మరిచి సన్నిహితంగా ఉండటం.. వారితో అక్రమ సంబంధాలు నెరపడం వంటివి చేయడం కల్పిత దోషం కిందకు వస్తుంది. ఈ దోషం ఏర్పడితే తన కంటే వయస్సులో అగ్రజులైన మహిళలకు సాయం చేస్తే సరిపోతుంది. 
 
4. వంతుల్క దోషం: 
ఓ వ్యక్తి తన కంటే పెద్దదైన మహిళను వివాహం చేసుకుంటే.. ఆ వ్యక్తికి శ్వాసకోశ వ్యాధులు, నరాలకు సంబంధించిన వ్యాధులు ఏర్పడతాయి. ఇలా జరిగితే దాన్ని వంతుల్క దోషం అంటారు. ఈ దోష నివారణకు వృద్ధ దంపతులకు దానధర్మాలు చేయాలి. 
 
5. ప్రణకాల దోషం.. 
జాతకాలు చూడకుండా.. ఆస్తి, కీర్తి ప్రతిష్టలు, ఉన్నత పదవులకు ఆశపడి వివాహం చేసుకుంటే.. వారికి ప్రణకాల దోషం ఏర్పడుతుంది. తద్వారా జీవితంలో దంపతుల మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడుతాయి. ఈ దోషాన్ని నివృత్తి చేసుకోవాలంటే.. అనాధ శరణాలయాల్లోని మహిళలకు దానధర్మాలు చేయాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.