మే 27 నుంచి జూన్ 2 వరకు మీ వార రాశి ఫలితాలు(Video)

వృషభంలో రవి, బుధుడు, మిధునంలో శుక్రుడు, కర్కాటకంలో రాహువు, తులలో వక్రి బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో కుజ, కేతువులు. తుల, వృశ్చిక, ధనస్సు, మకరంలో చంద్రుడు. 27న బుధుడు వృషభ ప్రవేశం. 29న కర్తెరీ త్యాగం. 2న సంకటహర చతుర్థి. ముఖ్యమైన పనులకు విదియ గు

rashi phalalu
Raman| Last Modified శనివారం, 26 మే 2018 (21:18 IST)
వృషభంలో రవి, బుధుడు, మిధునంలో శుక్రుడు, కర్కాటకంలో రాహువు, తులలో వక్రి బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో కుజ, కేతువులు. తుల, వృశ్చిక, ధనస్సు, మకరంలో చంద్రుడు. 27న బుధుడు వృషభ ప్రవేశం. 29న కర్తెరీ త్యాగం. 2న సంకటహర చతుర్థి. ముఖ్యమైన పనులకు విదియ గురువారం అనుకూలదాయకం.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆదాయానికి తగ్గట్టే ఖర్చులుంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. విలువైన వస్తువులు అమర్చుకుంటారు. మంగళ, బుధ వారాల్లో ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. అవివాహితులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. సన్నిహితులలో సంప్రదింపులు జరుపుతారు. గృహమార్పు అనివార్యం. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనులు సకాలంలో పూర్తికాగలవు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. చాకచక్యంగా వ్యవహరించాలి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆది, గురు వారాల్లో గుట్టుగా యత్నాలు సాగించండి. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. శుభవార్తలు వింటారు. కష్టం ఫలిస్తుంది. ధనలాభం, వాహన సౌఖ్యం పొందుతారు. ఖర్చులు ప్రయోజనకరం. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. ఊహించని సంఘటనలెదురవుతాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆత్మీయుల క్షేమం ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. సరుకు నిల్వలో అప్రమత్తంగా ఉండాలి. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. మంగళ, శని వారాల్లో ఒత్తిడి, ఆందోళన అధికం. వ్యవహారాల్లో ప్రతకూలతలెదుర్కుంటారు. ఆశాభావంతో యత్నాలు కొనసాగించండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. సంతానం విజయం సంతోషపరుస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. ఆరోగ్యం సంతృప్తికరం. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
యత్నాలు సాగక నిరుత్సాహం చెందుతారు. మీలో వైరాగ్యం నెలకొంటుంది. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులుంటాయి. సాయం అడిగేందుకు మనసు అంగీకరించదు. చెల్లింపులు వాయిదాపడతాయి. గురు, శుక్ర వారాల్లో పనులు మెుండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఓర్పుతో మెలగండి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. సన్నిహితుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు కొంత మెరుగ్గా సాగుతాయి. నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గృహంలో సందడి నెలకొంటుంది. ఆత్మీయులకు సాయం అందిస్తారు. చెల్లింపులు, చెక్కుల జారీలో జాగ్రత్త. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కుటుంబీకుల సలహా పాటించండి. శనివారం నాడు ఏకపక్షంగా వ్యవహరించవద్దు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. ఆర్థికలావాదేవీలు లాభిస్తాయి. ధనప్రాప్తి ఉంది. ఉత్సాహంగా ఉంటారు. పనులు సానుకూలమవుతాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. వివాదాలు కొలిక్కి వచ్చే సూచనలున్నాయి.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ వారం కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆత్మీయుల క్షేమం సంతృప్తినిస్తుంది. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. పనులు మెుండిగా పూర్తి చేస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. విలువైన వస్తువులు మరమ్మత్తుకు గురవుతాయి. గృహమార్పు అనివార్యం. సంతానం విదేశీ చదువులపై శ్రద్ధ వహిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ప్రయాణం తలపెడతారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు తీవ్రంగా కృషి చేస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆప్తులను కలుసుకుంటారు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. పెద్దమెుత్తం చెల్లింపుల్లో జాగ్రత్త. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం చదువుల గురించి ఆలోచిస్తారు. పెద్దల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. ఆందోళన తొలగి కుదుటపదుతారు. విద్యా ప్రకటనలు విశ్వసించవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. పెట్టుబడులకు సమయం కాదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
అప్రమత్తంగా వ్యవహరించాలి. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీ శ్రీమతి సలహా పాటించండి. ప్రముఖుల సందర్శనం సాధ్యం కాదు. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. సంతానం విజయం సంతృప్తినిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం స్ధిరంగా ఉంటుంది. బంధుమిత్రులతో విభేదిస్తారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆది, సోమ వారాల్లో మీ గౌరవానకి భంగం కలుగకుండా మెలగాలి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలు దొర్లే ఆస్కారం ఉంది. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో నిరుత్సాహం తప్పదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరషాడ 1వ పాదం
ధనలాభం ఉంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. వివాహ యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. అపరిచితులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మంగళ, బుధ వారాల్లో నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆందోళన తొలగి కుదుటపడతారు. పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంప్రదింపులకు అనుకూలం. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. మీ జోక్యం అనివార్యం. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు.
 
మకరం: ఉత్తరషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సంస్ధల స్ధాపనలకు అనుకూలం. పర్మిట్లు, లైసెన్స్‌ల రెన్యువల్‌‌లో అలక్ష్యం తగదు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. సన్నిహితులకు చక్కని సలహాలిస్తారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. రుణయత్నాలు ఫలిస్తయి. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన వస్తుంది. పనులు మెుండిగా పూర్తి చేస్తారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. గురు, శుక్ర వారాల్లో నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగస్తులకు పదవీయోగం, బాధ్యతల మార్పు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలే శ్రేయస్కరం. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం, ధనానికి లోటుండదు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమెుత్తం సాయం తగదు. సమర్ధతతో రాణిస్తారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. శనివారం నాడు నొప్పించక తానొవ్వక అన్న రీతిలే వ్యవహరించాలి. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. నిర్మణాలు, మరమ్మత్తులు వేగవంతమవుతాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతత్లో ఏకాగ్రత వహించండి.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరబాద్ర, రేవతి
కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంప్రదింపులకు అనుకూలం. గృహమార్పు కలిసివస్తుంది. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అవసరాలకు ధనం సర్దుబాటు చేసుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆది, సోమ వారాల్లో పనులు ప్రారంభంలో అవాంతరాలెదురవుతాయి. యత్నాలకు విరమించుకోవద్దు. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయకండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు హోదా మార్పు, స్ధానచలనం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఏజెన్సీలు, కాంట్రాక్టులకు ఏమంత సంతృప్తినీయవు. సభలు, సమావేశంలో పాల్గొంటారు.దీనిపై మరింత చదవండి :