శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Modified: శనివారం, 4 మే 2019 (19:49 IST)

05-05-2019 నుంచి 11-05-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. మీ నమ్మకం వమ్ముకాదు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. రాబడిపై దృష్టి పెడతారు. ఆది, సోమవారాల్లో పనుల్లో ఒత్తిడి అధికం. ఆత్మీయులను కలుసుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యవహారాలతో తీరిక ఉండదు. సామరస్యంగా మెలగాలి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆహ్వానాలు అందుకుంటారు. పరిచయాలు బలపడుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. నిర్మాణాలు, మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. సరుకు నిల్వలో జాగ్రత్త. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ బాధత్యల్లో మెళకువ వహించండి. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఖర్చులు విపరీతం. ధనం అందక ఇబ్బందులు ఎదుర్కుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. గృహమార్పు చికాకుపరుస్తుంది. మంగళ, బుధవారాల్లో ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆహ్వానం, పత్రాలు అందుతాయి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఒత్తిడి, పనిభారం. అధికారులకు విశ్రాంతిలోపం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. జూదాలు, బెట్టింగ్‌లో జోలికి పోవద్దు. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాలో ప్రతికూలతలే అధికం. చీటికి మాటికి అసహనం చెందుతారు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ప్రముఖుల కలయిక వలన ఏమంత ఫలితం ఉండదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు. గురు, శుక్రవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు. గురు, శుక్రవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దలను సంప్రదిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వేడుకలకు హాజరవుతారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. హోల్‌సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వైద్య, సాంకేతిక రంగాలవారికి ఆదాయాభివృద్ధి. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఆలోచనలు కార్యరూపందాల్చుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. శని, ఆదివారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. సంతానం చదువులపై దృష్టి పెడతారు. విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. మీ మాటతీరు వివాదాస్పదమవుతుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆశావాహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. అధికారులకు పనిభారం, విశ్రాంతి లోపం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కష్టానికి తగిన ఫలితం ఉంది. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. సోమ, మంగళ వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. దంపతుల మధ్య అవగాహన లోపం. పంతాలు, పట్టింపులకు పోవద్దు. విజ్ఞతతో వ్యవహరించండి. వేడుకలను ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు ధనప్రలోభం తగదు. ఉపాధి పథకాలూ ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
వ్యవహారానుకూలత ఉంది. యత్నాలకు కుటుంబీకులు సహకరిస్తారు. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. శుభకార్యానికి హాజరవుతారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. బుధ, గురువారాల్లో ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. సౌమ్యంగా మెలగండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత్త ప్రధానం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారుల ఆదాయం బాగుగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు. స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు.
ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. శుక్ర, ఆదివారాల్లో పెద్ద ఖర్చులు తగిలే సూచనలున్నాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది. ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పందాలు, బెట్టింగ్‌ల జోలికి పోవద్దు. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యోష్ట
కార్యసాధనలో జయం పొందుతారు. గృహం సందడిగా ఉంటుంది. స్థిరాస్తి మూలక ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పరిచయాలు బలపడతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రతిభాపాఠవాలు వెలుగులోకి వస్తాయి. పురస్కారాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. దైవకార్యంలో పాల్గొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు ఆటంకాలు ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం. 
ఈ వారం ఆశాజనకమే. రుణబాధలు తొలగి కుదుటపడతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వాయిదాపడిన పనులు పూర్తిచేస్తారు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. అవగాహనలేని విషయాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పరిచయంలేని వారితో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఉద్యోగస్తుల సమర్థత అధికారులకే లాభిస్తుంది. సహోద్యోగులతో వేడుకలు, వినోదాల్లో పాల్గొంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. రవాణా, మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వాహనచోదకులకు దూకుడు తగదు. 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
మాట నిలబెట్టుకుంటారు. గౌరవం పెరుగుతుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆత్మీయులు ఉల్లాసంగా గడుపుతారు. మీ సలహా ఎదుటివారికి లాభిస్తుంది. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. అనుకూల ఫలితాలున్నాయి. ఖర్చులు అదుపులో ఉండవు. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. సోమ, మంగళవారాల్లో పనుల్లో అవాంతరాలెదురవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. గృహమార్పు కలిసివస్తుంది. పెట్టుబడులకు సమయం కాదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్చికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొంటారు. వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు. 
అనుకూల పరిస్థితులున్నాయి. అవకాశాలను వదులుకోవద్దు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. పెద్దమొత్తం సాయం తగదు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. బుధ, గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం చదువులపై దృష్టిపెడతారు. పరిచయాలు బలపడతాయి. సేవ, దైవకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, విశ్రాంతిలోపం. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు అధికం. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
శుభవార్త వింటారు. కష్టం ఫలిస్తుంది. అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వాగ్దాటితో రాణిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. శని, ఆదివారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలివేయండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలకు ధనం అందుతుంది. వేడుకల్లో పాల్గొంటారు. మీ రాక ఆత్మీయులకు సంతోషం కలిగిస్తుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. కొనుగోలుదార్లతో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు ఒత్తిడి, విశ్రాంతి లోపం.