శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 2 ఫిబ్రవరి 2019 (19:39 IST)

03-02-2019 నుంచి 09-02-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు (video)

కర్కాటకంలో రాహువు, తులలో గురు, శుక్రులు, ధనస్సులో రవి, మకరంలో రవి, బుధ, కేతువులు, మీనంలో కుజుడు. ధనస్సు, మకర, కుంబ, మీనంలలో చంద్రుడు. ముఖ్యమైన పనులకు తదియ గురువారం అనుకూలం. 
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు సామాన్యం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆహ్వానాలు అందుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. బుధ, గురు వారాల్లో పనుల్లో ఆటంకాలెదురవుతాయి. పట్టుదలతో ముందుకు సాగండి. సహాయం, సలహాలు ఆశించవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. బంధువులను కలుసుకుంటారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదామార్పు, వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెట్టుబడులు, వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. విద్యార్థులకు ఒత్తిడి, శ్రమ. వివాదాలు సద్దుమణుగుతాయి. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సంప్రదింపులకు అనుకూలం. అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటుతనం తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు ముందుకు సాగవు. గత సంఘటనలు పునరావృతమవుతాయి. శనివారం నాడు చీటికిమాటికి అసహానం చెందుతారు. వేడుకలకు హాజరవుతారు. మీ రాక అయిన వారికి సంతోషం కలిగిస్తుంది. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. గుట్టుగా యత్నాలు సాగించండి. మీ జోక్యం అనివార్యం. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారులు లాభసాటిగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు, ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికలావాదేవీలతో హడావుడిగా ఉంటారు. సంప్రదింపులు ఫలిస్తాయి. చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ధనలాభం ఉంది. ఖర్చులు విపరీతం. వేడుకలను ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. ఆది, సోమ వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. ఆడిటర్లకు ధనలాభం, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. రిప్రజెంటేటివ్‌లకు శ్రమ అధికం.  
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యపరీక్షలు అవసరమవుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతి వైఖరి అసహానం కలిగిస్తుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పంతాలు, పట్టుదలకు పోవద్దు. మంగళ, బుధ వారాల్లో అకారణంగా మాటపడవలసి వస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. అధికారులకు స్థానచలనం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.  
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వాగ్ధాటితో రాణిస్తారు. వివాదాలు సద్దుమణుగుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ధనమూలక సమస్యలెదురవుతాయి. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. గురు, శుక్ర వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. పట్టుదలతో శ్రమించిన గానీ పనులు పూర్తికావు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.  
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు మూలక ధనం గ్రహిస్తారు. శని, ఆది వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యపడదు. వేడుకలకు హాజరవుతారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. చేజారిపోయిన పత్రాలు లభిస్తాయి. గృహమార్పు అనివార్యం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు మున్మందు సత్ఫలితాలీయగలవు. విద్యార్థులకు శ్రమ, ఒత్తిడి అధికం.    
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లావాదేవీలు, వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సోదరుల గురించి ఆలోచిస్తారు. ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. ఆహ్వానాలు, నోటీసులు అందుతాయి. దంపతుల మధ్య అవగాహన లోపం. సోమ, మంగళ వారాల్లో పట్టుదలకు పోవద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆశించిన పదవులు దక్కవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి.   
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఈ వారం వాహన సౌఖ్యం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఆదాయం బాగుంటుంది. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు సజావుగా సాగుతాయి. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుకాదు. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. సమర్థతకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. స్వయం కృషితో రాణిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు, వస్తువులు సంపాదిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
అవకాశాలు చేజారిపోతాయి. నిరుత్సాహం వీడి ముందుకు సాగండి. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పట్టుదలతో శ్రమించిన గానీ పనులు పూర్తికావు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి వైఖరి అసహానం కలిగిస్తుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యపరీక్షలు తప్పవు. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. సహోద్యోగుల సాయంతో సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే మంచిది. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.  
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. పరిచయాలు, బంధువత్వాలు బలపడుతాయి. ప్రముఖుల రాక ఉత్సాహాన్నిస్తుంది. ఖర్చులు అధికం. సంతృప్తికరం. కొన్ని ఇబ్బందులు తొలుగుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ఆది, సోమ వారాల్లో అనవసర జోక్యం తగదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. నిరుద్యోగులు రాతపరీక్షలకు హాజరవుతారు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. పనివారలతో జాగ్రత్త. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయం బాగుంటుంది. రుణబాధలు తొలగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. వ్యవహారానుకూలత ఉంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మంగళ, బుధవారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సోదరులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఎవరినీ నిందించవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. విందులు, వినోదాల్లో మితంగా ఉండాలి. జూదాల జోలికి పోవద్దు.  
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సమర్థతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. బాధ్యతలు అధికమవుతాయి. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. ధనలాభం ఉంది. ఆపన్నులకు సాయం అందిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. గురు, శుక్ర వారాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవు. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహించండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొత్త పథకాలు అమలు చేస్తారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి.