ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: మంగళవారం, 17 అక్టోబరు 2017 (22:05 IST)

21-10-2017 వరకు మీ వార రాశి ఫలితాలు

కర్కాటకంలో రాహువు, కన్యలో రవి, శుక్ర, కుజులు, తులలో బుధ, గురువు, వృశ్చికంలో శని, మకరంలో కేతులు. కర్కాటక, సింహ, కన్య, తులల్లో చంద్రుడు. 17న రవి తుల ప్రవేశం. 18న నరక చతుర్దశి, 19న దీపావళి. 20 నుంచి కార్తీక మాసం ప్రారంభం. 2 భగినీ హస్త భోజనం.

కర్కాటకంలో రాహువు, కన్యలో రవి, శుక్ర, కుజులు, తులలో బుధ, గురువు, వృశ్చికంలో శని, మకరంలో కేతులు. కర్కాటక, సింహ, కన్య, తులల్లో చంద్రుడు. 17న రవి తుల ప్రవేశం. 18న నరక చతుర్దశి, 19న దీపావళి. 20 నుంచి కార్తీక మాసం ప్రారంభం. 2 భగినీ హస్త భోజనం.   
 
మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం.
కొత్త విషయాలపై దృష్టి పెడతారు. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. సంతానం ఉత్సాహాన్ని అదుపు చేయండి. విజ్ఞతతో మెలిగి ప్రశంసలందుకుంటారు. కుటుంబ సమస్యలు సర్దుకుంటారు. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. గురు, శుక్రవారాల్లో పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో మెలకువ వహించండి. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు మునుముందు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. 
గృహంలో సందడి నెలకొంటుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. వ్యవహారాలు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఖర్చులు సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతాయి. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. శనివారం నాడు ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ఆత్మీయుల సలహా తీసుకోండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. సరకు నిల్వల్లో జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు. ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. 
ఈ వారం కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలకు విలువనివ్వండి. అనుకున్న సాధించలేకపోయామనే వెలితి వుంటుంది. పట్టుదలతో యత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. స్వయంకృషితోనే రాణిస్తారు. ఖర్చులు అధికం. సంతానం కోసం బాగా వ్యయం చేస్తారు. కీలక పత్రాలు, నోటీసులు అందుకుంటారు. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. పెట్టుబడుల విషయంలో నిర్ణయానికి రాగలుగుతారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు వుండవు. చిరువ్యాపారులకు ఆశాజనకం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఆస్తి, భూవివాదాలు, పరిష్కార దిశగా సాగుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణం చికాకుపరుస్తుంది.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్నిరంగాల వారికి ఆశాజనకం. వస్త్రప్రాప్తి, దాంపత్యసుఖం పొందుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. పెట్టుబడులు, పొదుపు పథకాలకు అనుకూలం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పందాలు, బెట్టింగ్‌లకు దూరంగా వుండాలి. విద్యార్థుల్లో ఏకాగ్రత నెలకొంటుంది.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
మీ ప్రమేయంతో ఒక సమస్య పరిష్కారం అవుతుంది. కలిసివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఒక వ్యవహారం లాభిస్తుంది. ఖర్చులు విపరీతం. ఆత్మీయులను వేడుకలకు ఆహ్వానిస్తారు. పనులు, బాధ్యతలు స్వయం చూసుకోవాలి. ఆది, సోమవారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. గృహ నిర్మాణాలు నిదానంగా సాగుతాయి. టెండర్లు, ఏజెన్సీల విషయంలో పునరాలోచన మంచిది. తొందరపాటు నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకోగలుగుతారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
పట్టుదలతో యత్నాలు సాగించండి. త్వరలో శుభవార్త వింటారు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం వుంది. పొదుపు మూలక ధనం ముందుగానే గ్రహిస్తారు. పెట్టుబడుల ఆలోచనను విరమించుకుంటారు. ఎదుటివారి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సహనం కోల్పోవద్దు. మిమ్ములను తక్కువ అంచనా వేసిన వారే మీ సమర్థతను గుర్తిస్తారు. మంగళ, బుధవారాల్లో దంపతుల మధ్య అవగాహన లోపం, చికాకులు తలెత్తుతాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆత్మీయుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. ప్రకటనల వల్ల అవగాహన ప్రధానం, ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు.
దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో నిర్ణయానికి రాగలుగుతారు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. పంతాలు, భేషజాలకు పోవద్దు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించి భంగపడతారు. గురు, శుక్రవారాల్లో ఖర్చులు అంచనాలను మించుతాయి. సాయం చేసేందుకు సన్నిహితులే సందేహిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించండి. దూరపు బంధువుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. అధికారుల తీరును గమనించి మెలగాలి. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. మీ పథకాలు మంచి ఫలితాలను ఇస్తాయి.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట.
ఆర్థిక సమస్యల మనస్థిమితం లేకుండా చేస్తాయి. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ప్రముఖులతో  సంప్రదింపులు జరుపుతారు. శనివారం నాడు ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషపరుస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఆశావహదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. ట్రావెల్స్, ట్రాన్స్‌పోర్ట్ రంగాల వారికి  కొత్త సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులకు ఒత్తిడి అధికం.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం. 
గృహంలో సందడి నెలకొంటుంది. ఖర్చులు విపరీతం. ఆదాయానికి ఇబ్బంది వుండదు. సకాలంలో పనులు పూర్తి కాగలవు. సంతానం అత్యుత్సాహం అదుపుచేయండి. ధనలాభం, వస్త్రప్రాప్తి, వాహన యోగం పొందుతారు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆది, సోమవారాల్లో ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తుల బాధ్యతలు పెరుగుతాయి. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. గుట్టుగా యత్నాలు సాగించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. తొందరపడి సలహాలివ్వవద్దు. మంగళ, బుధవారాల్లో ఆందోళనకరమైన సంఘటనలు ఎదురవుతాయి. టెండర్లు, ఏజెన్సీలు చేజారిపోతాయి. పెట్టుబడులకు సమయం కాదు. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు ఓర్పు, సమయపాలన ప్రధానం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. విద్యార్థులు పోటీల్లో విజయం సాధిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు. 
అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. విలువైన పత్రాలు జాగ్రత్త. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఎంతగా శ్రమించినా ఫలితం ఉండదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. సహాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే రాణిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చెల్లింపులు, అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆది, గురువారాల్లో పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. పదవులు, సభ్యత్వాల నుంచి తప్పుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం. ఉత్తరాభాద్ర, రేవతి. 
ఖర్చులు విపరీతం, అవసరాలు అతికష్టంమీద తీరుతాయి. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. మంగళ, శనివారాల్లో పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదాపడతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. నోటీసులు, ఆహ్వానం అందుకుంటారు. గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీ అలవాట్లు బలహీనతలు అదుపులో వుంచుకోండి. విద్యార్థులు పోటీల్లో రాణిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సేవ, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు.