మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Modified: శనివారం, 22 డిశెంబరు 2018 (19:17 IST)

23-12-2018 నుంచి 29-12-2018 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)

కర్కాటకంలో రాహువు, తులలో శుక్రుడు, వృశ్చికంలో బుధు, గురువులు, ధనస్సులో రవి, శని, మకరంలో కేతువు, మీనంలో కుజుడు. మిధఉన, కర్కాటక, సింహ, కన్యలలో చంద్రుడు. 23న కుజుడు మీన ప్రవేశం. 25న సంకటహర చతుర్ధి, ముఖ్యమైన పనులకు సప్తమి, శనివారం అనుకూలదాయకం.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఖర్చులు అంచనాలను మించుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పట్టుదలతో శ్రమించిన గానీ పనులు పూర్తికావు. పరిస్థితుల అనుకూలత అంతగా లేదు. ఓర్పుతే యత్నాలు సాగించాలి. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. శనివారం నాడు ప్రముఖులను కలిసినా ఫలితం శూన్యం. మీ ఆశక్తతను కుటుంబీకులు అర్ధం చేసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం. పందాలా, పోటీల్లో విజయం సాధిస్తారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టిపెడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆందోళన తొలగి కుదుటపడుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పదవుల వ్యాపకాలు సృష్టించుకుంటారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరువ్యాపారులకు పురోభివృద్ధి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ వారం ధనలాభం ఉంది. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు రూపొందించుకుంటారు. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. ఆభరణాలు, వాహనం కొనుగోలుచేస్తారు. రశీదులు జాగ్రత్త. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. సేవాసంస్థలకు సాయం అందిస్తారు. క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటుతనం వలన ఇబ్బందులు ఎదుర్కుంటారు. మీ శ్రీమతి సలహా పాటించండి. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితుల అనుకూలత ఉంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆది, సోమ వారాల్లో పెద్దల ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. శుభకార్యంలో పాల్గొంటారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. విలువైన కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ప్రియతములను కలుసుకుంటారు. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు చురుకుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త.   
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. ఆత్మీయుల కోసం బాగా వ్యయం చేస్తారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ఉన్నత పదవులు అందుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. తొందరపడి హామీలివ్వవద్దు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. మంగళ, బుధ వారాల్లో పొగిడేవారితో జాగ్రత్త. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. అనేక పనులతో సతమతమవుతారు. శ్రీమతి లేక శ్రీవారి వైఖరిలో మార్పువస్తుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దల సలహా పాటించండి. ఫోన్ సందేశాలు, ప్రకటనులు విశ్వసించవద్దు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వాయిదా పడిన పనులు పూర్తికాగలవు. గురు, శుక్ర వారాల్లో ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. ఆహ్వానం, నోటీసులు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పెట్టుబడులకు అనుకూలం. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం క్షేమం కాదు. కష్టానికి తగిన ఫలితం ఉంది. పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. సహాయం ఆశించవద్దు. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. వ్యాపారాల్లో పురోగతి, అనుభవం గడిస్తారు. వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. పుణ్యకార్యంలో పాల్గొంటారు.    
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అన్ని రంగాలవారికి యోగదాయకమే. స్వయంకృషితో రాణిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. అవకాశాలు కలిసివస్తాయి. వ్యవహారానుకూలత ఉంది. ఖర్చులు విపరీతం, పొదుపు ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. శనివారం నాడు ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. గృహ మరమ్మత్తులు, మార్పుచేర్పులు చేపడతారు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. క్రయవిక్రయాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. పోటీల్లో రాణిస్తారు.   
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. లౌక్యంగా బాకీలు వసూలు చేసుకోవాలి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఓర్పు, పట్టుదలతో ముందుకు సాగండి. యత్నాలు విరమించుకోవద్దు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఆది, సోమ వారాల్లో అనవసర జోక్యం తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. దైవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు.  
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
వేడుకల్లో పాల్గొంటారు. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ప్రియతములను కలుసుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఏ విషయాన్ని తెగేవరకూ లాగవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. దంపతుల మధ్య దాపరికం తగదు. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. మంగళ, బుధ వారాల్లో ప్రముఖుల సందర్శనం అనుకూలించదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి. ఓర్పుతో ఉద్యోగయత్నం సాగించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. క్రీడా, కళాకారులకు ప్రోత్సాహకరం.   
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
పెద్దలతో ఆస్తి వ్యవహారాలు సంప్రదిస్తారు. సోదరులు మీతో కలిసిరాకపోవచ్చు. అనునయంగా మెలగండి. ఆది, గురు వారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ప్రముఖులను కలుసుకుంటారు. ఈ ఇబ్బందులు తాత్కాలికమే. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. రుణ విముక్తులవుతారు. ఖర్చులు సామాన్యం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలను విశ్వసించవద్దు. త్వరలో అనుకూల ఫలితాలుంటాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. పుణ్యకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. భాగస్వామిక చర్చలు కొలిక్కివస్తాయి. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఖర్చులు అంచనాలను వించుతాయి. అయిన వారి కోసం వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వాగ్ధాటితో రాణిస్తారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. నోటిసులు, కీలక పత్రాలు అందుకుంటారు. వేడుకల్లో అత్యుత్సాం ప్రదర్శించవద్దు. మంగళ, శని వారాల్లో అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి, వైద్య సేవలు అవసరం. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో పోటీని దీటుగా ఎదుర్కుంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. షేర్ల క్రయవిక్రయాలు లాభిస్తాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. కష్టానికి తగ్గ ఫలితం ఉంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి మూలక ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. సన్నిహితులకు సాయం అందిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. గృహమార్పు కలిసివస్తుంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు. అనవసర జోక్యం తగదు. గురు, శుక్ర వారాల్లో కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. క్రయవిక్రయాలు ఊపందుకుంటాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపులు, అనుభవం గడిస్తారు. పూర్వ విద్యార్థుల సమ్మేనంలో పాల్గొంటారు. గత సంఘటనలు కొత్త అనుభూతినిస్తాయి. వీడియో చూడండి...