Widgets Magazine

ఫిబ్రవరి 11 నుంచి 17 వరకూ మీ వార రాశి ఫలితాలు

కర్కాటకంలో రాహువు, తులలో బృహస్పతి, వృశ్చికంలో కుజుడు, ధనస్సులో శని, మకరంలో రవి, బుధ, కేతువులు, కుంభంలో శుక్రుడు. ధనస్సు, మకర, కుంభ, మీనంలలో చంద్రుడు. 12న రవి, 14న బుధుడు కుంభ ప్రవేశం. 11న సర్వ ఏకాదశి, 13న మహా శివరాత్రి.

Dr PA Raman
Raman| Last Modified శనివారం, 10 ఫిబ్రవరి 2018 (22:21 IST)
కర్కాటకంలో రాహువు, తులలో బృహస్పతి, వృశ్చికంలో కుజుడు, ధనస్సులో శని, మకరంలో రవి, బుధ, కేతువులు, కుంభంలో శుక్రుడు. ధనస్సు, మకర, కుంభ, మీనంలలో చంద్రుడు. 12న రవి, 14న బుధుడు కుంభ ప్రవేశం. 11న సర్వ ఏకాదశి, 13న మహా శివరాత్రి.

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
పరిచయాలేర్పడుతాయి. మీ ఉన్నతిని చాటుకునేందుకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. గృహమార్పు కలిసివస్తుంది. శుభవార్తలు వింటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆర్థికలావాదేవీలతో హడావుడిగా ఉంటారు. శనివారం నాడు వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం వుంది. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అవివాహితులు కొత్త అనుభూతికి లోనవుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. ఒక సమాచారం తీవ్రంగాా ఆలోచింపచేస్తుంది. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు.

వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
పదవులు, సభ్యత్వాలకు అనుకూలం. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ప్రత్యర్థుల కదలికలపై దృష్టి సారించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనమూలక సమస్యలెదుర్కుంటారు. ఆది, సోమవారాల్లో పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తి కావు. నగదు, పత్రాలు జాగ్రత్త. గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. దంపతుల ఆలోచనలు కొలిక్కివస్తాయి. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. వివాహ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. వృత్తుల వారికి ఆదాయాభిృద్ధి. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. దైవ కార్యంలో పాల్గొంటారు.

మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. స్థిరచరాస్తుల కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. సర్వత్రా అనుకూలతలుంటాయి. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. పనులు చురుకుగా సాగుతాయి. మంగళ, బుధవారాల్లో ఖర్చులు విపరీతం. అయిన వారి కోసం బాగా వ్యయం చేస్తారు. పెద్దమొత్తం ధనసహాయం క్షేమం కాదు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆరోగ్యం సంతృప్తికరం. ఫోన్ సందేశాలు, అపరిచితులను విశ్వసించవద్దు. ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు చక్కని అవకాశం లభిస్తుంది. న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారులు ఊపందుకుంటాయి. సరకు నిల్వలో అప్రమత్తంగా ఉండాలి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. రావలసిన ఆదాయాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. ఆచితూచి వ్యవహరించాలి. ఏ విషయంలోను తొందరపడవద్దు. ఆది, గురువాల్లో కొంతమంది వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. బాధ్యతలు, పనులు అప్పగించవద్దు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సౌమ్యంగా మెలగండి. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. ఉద్యోగస్తులు తప్పిదాలను సరిదిద్దుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ధనలాభం, వాహనయోగం పొందుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఖర్చులు భారమనిపించవు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గుర్తుంచుకోవాలి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మనోధైర్యంతో వ్యవహరించండి. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. మంగళ, శనివారాల్లో పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగించింది. పెద్దలతో సంప్రదింపులు జరుగుతారు. గృహమార్పు కలిసివస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. వ్యాపారాభివృ్ద్ధికి పథకాలు అమలు చేస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఇంటా బయటా అనుకూలతలుంటాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి కాగలవు. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. గురు, శుక్రవారాల్లో బంధువుల మాటతీరు బాధిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులు శుభవార్త వింటారు. విందులు, వేడుకల్లో మితంగా ఉండాలి. సేవా కార్యక్రమాలు, దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి.

తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ ప్రమేయంతో ఒక వ్యవహారం సానుకూలమవుతుంది. పనులు వేగవంతమవుతాయి. గృహమార్పు కలిసివస్తుంది. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. అవకాశాలు అనుకోకుండా కలసివస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. శనివారం నాడు అనవసర జోక్యం తగదు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఏకపక్ష నిర్ణయాలు తగవు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.

వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
వేడుకలను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. పనులు హడావుడిగా సాగుతాయి. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. రుణ బాధలు తొలగుతాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు, వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. సేవా, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. దైవకార్యంలో పాల్గొంటారు.

ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఈ వారం సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆందోళన తొలగుతుంది. ఆదాయానికి తగినట్లు ఖర్చులుంటాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. దంపతుల మధ్య అరమరికలు తగవు. నగదు, పత్రాలు జాగ్రత్త. మొహమ్మాటాలు, ఒత్తిళ్లకు లొంగవద్దు. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. ఆరోగ్యం, సంతానం, భవిష్యత్తు, కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. వృత్తిపరమైన ఆటంకాలను అధిగమిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. విందులు, వేడుకల్లో అత్యుత్సాహం తగదు.

మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఖర్చులు విపరీతం. పొదుపునకు అవకాశం లేదు. చేబదుళ్లు, రుణాలు స్వీకరిస్తారు. పనులు అర్థాంతంగా ముగించాల్సి వస్తుంది. ప్రముఖుల సందర్శన కోసం పడిగాపులు తప్పవు. ఆది, సోమవారాల్లో ఎదుటివారి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సహనం కోల్పోవద్దు. తప్పుపట్టిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా తీసుకోండి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. వ్యాపారాభివృద్ధికి పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగ ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి.

కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. సహోద్యోగుల సాయంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. మంగళ, బుధవారాల్లో ఆకస్మిక ఖర్చులు, పెరిగిన ధరలు చికాకుపరుస్తాయి. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. పనులు సాగక విసుగు చెందుతారు. ఆత్మీయుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. ఈ సమస్యలు, ఇబ్బందులు తాత్కాలికమేనని గమనించండి. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనవసర విషయాల్లో జోక్యం తగదు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. గురు, శుక్రవారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త. మీ గౌరవానికి భంగం కలుగకుండా వ్యవహరించండి. కొన్ని సమస్యల నుంచి విముక్తులవుతారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఉపకారానికి ప్రత్యుపకారం పొందుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే వుంటాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరం. పుణ్యకార్యంలో పాల్గొంటారు.


దీనిపై మరింత చదవండి :