Widgets Magazine

ఫిబ్రవరి 9న మీ రాశి ఫలితాలు ... బంధు మిత్రుల రాకతో...

శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (08:18 IST)

daily astro

మేషం : ప్రైవేటు విద్యాసంస్థల్లోనివారు, రిప్రజెంటేటివ్‌లు మార్పులకై చేయు యత్నాలు ఫలిస్తాయి. ముఖ్యులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. 
 
వృషభం : సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థికస్థితి ఆటంకంగా నిలుస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. మీ మంచితనం, మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. హోటలు, తినుబండ, వ్యాపారులకు, కేటరింగ్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. 
 
మిథునం : కోర్టు వ్యవహారాలలో చికాకులను ఎదుర్కొంటారు. అప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. రావలసిన ధనం వసూలు కాకపోవడంతో స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు సమర్ధంగా పని చేసి అధికారుల మెప్పు పొందుతారు. 
 
కర్కాటకం : కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. దుబారా ఖర్చులు నిలువరించాలన్న మీ యత్నం ఫలించదు. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. 
 
సింహం : గృహమునకు కావలసిన విలువైన వస్తువులు అమర్చుకుంటారు. ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. ఆపత్సమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు. వ్యాపారాల్లో ఎదురైన ఆటుపోట్లను తట్టుకుంటారు. సాహసించి తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్‌లో మంచి ఫలితాలనిస్తాయి. 
 
కన్య : కుటుంబంలో ప్రశాంతత చోటుచేసుకుంటుంది. ఉపాధ్యాయులకు పనిలో చికాకులు తప్పవు. మీ మాటలకు సంఘంలో గౌరవం లభిస్తుంది. తీర్థయాత్రలలో చికాకులు ఎదుర్కొంటారు. రాజకీయ నాయకుల నుంచి ఆసక్తికరమైన వార్తలు వింటారు. బంధు మిత్రుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. 
 
తుల : విద్యార్థులు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలుగుతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి చికాకులు అధికమవుతాయి. ప్రేమానుబంధాలు, పాత మిత్రులతో సంబంధబాంధవ్యాలు మరింత బలపడతాయి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికంకావడంతో చికాకు తప్పదు. 
 
వృశ్చికం : ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. రావలసిన ధనం కొంత మొత్తమైనా చేతికందుతుంది. ఇతరుల గురించి హాస్యానికై మీరు చేసిన వ్యాఖ్యానాల వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి సమస్యలు తలెత్తినా తోటివారి సహకారం వల్ల సమసిపోగలవు. 
 
ధనస్సు : లాయర్లకు, డాక్టర్లకు, పురోభివృద్ధి లభిస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. రుణ విముక్తులు కావడంతో కొత్త రుణాలు అనుకూలిస్తాయి. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ప్రయాణాలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. హామలు ఉండటం మంచిది కాదని గమనించండి. 
 
మకరం : స్త్రీలకు దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సిమెంట్, కలప, ఇటుక వ్యాపారస్తులకు పురోభివృద్ధి. మీ చుట్టు పక్కల వారితో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కొంతమంది మీ గురించి చాటుగా విమర్శలు చేసే ఆస్కారం ఉంది. ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. 
 
కుంభం : బంధువుల రాకపోకలు సంతృప్తినిస్తాయి. సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు లాభదాయకం. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో మెళకువ అవసరం. దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ప్రభుత్వ ఉద్యోగులకు కలిసివస్తుంది. విద్యార్థుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. 
 
మీనం : బ్యాంకు లావాదేవీలయందు అనుకూలతలుంటాయి. ఆగిపోయిన పనులు పునఃప్రారంభిస్తారు. బంధు మిత్రులతో రాకతో ఖర్చులు అధికమవుతాయి. రాజకీయ నాయకులకు పదవులయందు అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడవచ్చు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత అవసరం. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
February 9 Daily Horoscope Today Astrology Daily Prediction Today Astro

Loading comments ...

భవిష్యవాణి

news

గురువారం మీ రాశిఫలితాలు .. దంపతుల మధ్య...

మేషం : కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. సమయానికి కావలసిన వస్తువు ...

news

బుధవారం మీ దినఫలితాలు : సరదాలు.. కోరికలు....

మేషం : చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. సతీసమేతంగా ఒక ...

news

అమ్మో చిత్తా నక్షత్రంలో పుట్టిన మహిళలు ఇలా వుంటారట?

చిత్తా నక్షత్రానికి కుజుడు అధిపతి. ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులు తన నిర్ణయమే సరైందని ...

news

మంగళవారం మీ రాశిఫలితాలు : జీవిత భాగస్వామికి...

మేషం: ఆర్థిక పరిస్థితులు కొంత వరకు మెరుగుపడతాయి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ...

Widgets Magazine