గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 12 అక్టోబరు 2020 (22:32 IST)

కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఏం జరుగుతుంది?

దీపారాధనకు ఉపయోగించే వత్తులను జాగ్రత్తగా ఉపయోగించాలనేది పెద్దల మాట. దీపారాధన తూర్పు వైపు దిశగా చేయాలి. అయితే దీపారాధన ద్వారా ఉత్తమ ఫలితాలను పొందాలంటే శ్రేష్ఠమైన వత్తులను ఎంచుకోవాలి. కాటన్‌ దుస్తులతో పసుపు రాసిన వత్తులను వెలిగించడం ద్వారా దుష్ట శక్తుల ప్రభావం వుండదని విశ్వాసం. అలాగే దూదితో తయారైన వత్తులను వెలిగించడం శుభకరం. 
 
అరటికాడతో తయారైన వత్తులను వెలిగించడం ద్వారా సంతాన భాగ్యం చేకూరుతుంది. పట్టు నూలుతో తయారైన వత్తులతో దీపమెలిగిస్తే సమస్త శుభాలు చేకూరుతాయి. తామర కాడలతో తయారైన వత్తులతో దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. కొబ్బరినూనెతో దీపమెలిగిస్తే ఆరోగ్యం, సిరిసంపదలు చేకూరుతాయి. నువ్వులనూనెతో దీపమెలిగిస్తే.. శత్రుబాధ వుండదు. యమభయం తొలగిపోతుంది.
 
నేతితో దీపం వెలిగిస్తే.. సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. మట్టితో తయారు చేసిన ప్రమిదలలో దీపమెలిగిస్తే.. కొత్త శక్తి, కొత్త ఉత్సాహం చేకూరుతుంది. దీప సరస్వతీ అంటూ మూడు సార్లు, దీపలక్ష్మీ అని మూడు సార్లు, దీప దుర్గా అని మూడుసార్లు పలకాలి. కులదైవం పేరును మూడుసార్లు ఉచ్చరించి దీపాన్ని వెలిగించాలి. దీపానికి 12సార్లు నమస్కరిస్తే ఆ ఇంట సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.