గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

జుట్టు విరబోసుకుని శుక్రవారం పూజ చేస్తే..?

Hair Style
జుట్టు విరబోసుకుని శుక్రవారం పూజ చేయడం... జుట్టు విరబోసుకుని దేవాలయాలకు వెళ్ళడం దోషమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. భగవంతునికి చేసే సేవలు, ఉపచారాలు శుచిగా శుభ్రంగా చేయాలి. జుట్టు విరబోసుకోవడం వల్ల వెంట్రుకలు రాలి పూజా ద్రవ్యాలలో పడి అపవిత్రం అవుతాయి. దేవాలయాల్లో ప్రసాద నివేదనం జరుగుతుంది. అన్న సంతర్పణలు జరుగుతాయి. 
 
జుట్టు విరబోసుకోవడం వల్ల రాలిన వెంట్రుకలు పొరపాటున ఆహార పదార్తాల్లో పడితే ఆ భోజనం వృధా అవుతుంది. వ్రత దీక్షలలో ఉన్నవారి కాలికి తల వెంట్రుకలు గానీ, జుట్టు నుంచి రాలిన నీటి బిందువులు గానీ తగలడం వల్ల వారికి దీక్షా భంగం కలుగుతుంది. 
 
ఆ దోషం దానికి కారణమైన వారికి తగులుతుంది. పూజా సమయంలో, దేవాలయాలకు వెళ్ళేటప్పుడు పవిత్రతనీ, శుచీ, శుభ్రతలను దృష్టిలో వుంచుకుని జుట్టు విరబోసుకుని వెళ్లకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అలాగే శుక్రవారం పూజ చేసేటప్పుడు కూడా జుట్టును విరబోసుకుని పూజ చేయడం నిషిద్ధం. జుట్టు తడిగా వుందనో లేకుంటే ఇతర కారణాల వల్ల జుట్టు విరబోసుకుని పూజ చేయడం దోషమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.