మంగళవారం కుమార స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తే..  
                                          నవగ్రహాల్లో కుజునికి అధిపతి కుమారస్వామి. కుజదోషం వున్నవారు, ఈతిబాధలతో ఇబ్బందిపడేవారు మంగళవారం పూట వ్రతమాచరించి.. కుమారస్వామిని స్తుతిస్తే.. శుభఫలితాలుంటాయి. ఇంకా కుజదోషాలు తొలగిపోతాయి. అలాగే ఆర్థిక ఇబ
                                       
                  
				  				  
				   
                  				  నవగ్రహాల్లో కుజునికి అధిపతి కుమారస్వామి. కుజదోషం వున్నవారు, ఈతిబాధలతో ఇబ్బందిపడేవారు మంగళవారం పూట వ్రతమాచరించి.. కుమారస్వామిని స్తుతిస్తే.. శుభఫలితాలుంటాయి. ఇంకా కుజదోషాలు తొలగిపోతాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలుండవు. కుమారస్వామికి ప్రీతికరమైన నక్షత్ర, తిథి, వారాల్లో వ్రతమాచరిస్తే కోరుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అందుకే మంగళవారం పూట, షష్ఠి తిథిన, కార్తీక నక్షత్రం రోజున కుమార స్వామిని పూజించే వారికి సంతాన ప్రాప్తి చేకూరుతుంది. మాంగల్యదోషాలు తొలగిపోతాయి.  
				  											
																													
									  
	 
	మంగళవారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి.. సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించుకోవాలి. ఇంటికొచ్చాక పాలు, పండ్లు తీసుకుని వ్రతమాచరించాలి. కుమారస్వామిని అష్టోత్తర నామాలతో స్తుతించాలి. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఇంట్లో దీపమెలిగించి కుమారస్వామికి నైవేద్యం, దీపారాధన చేయాలి. 
				  
	 
	అలాగే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరం. అందుకే మంగళవారం ఆరు వొత్తులు, ఆవునేతితో దీపమెలిగించాలి. కుమార స్వామిని ఎర్రటి పువ్వులతో పూజించాలి. ఇలా తొమ్మిది వారాల పాటు వ్రతమాచరిస్తే.. కుజదోషాలుండవు. వివాహ అడ్డంకులు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు.