గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. వ్యక్తిత్వ వికాసం
Written By
Last Updated : మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (19:20 IST)

క్షమాపణ కోరడమంటే తప్పు చేసినట్లు కాదు..?

మనిషి అందంగా కనిపించాలంటే ఎన్నో రకాల తెరలు తొలగించాలి.
కానీ, మనసు అందంగా కనిపించాలంటే మాత్రం అహం, అసూయ, 
ఈర్ష్య, ద్వేషం, క్రోధం అనే అడ్డుపొరలను తొలగించుకోవాలి.
 
మంచి మనసున్న ఏ మనిషినీ హద్దుదాటి కష్టపెట్టకండి..
అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధమవుతుంది..
 
క్షమాపణ కోరడమంటే మనం తప్పు చేసినట్లు కాదు..
మనం మన బంధానికి ఎక్కువగ విలువిస్తూ ఉన్నామని అర్థం...
 
చీకటిని చీకటితో జయించలేం.. కాంతితోనే అది సాధ్యం..
ద్వేషాన్ని ద్వేషంతో గెలవలేం.. దానికి ప్రేమ కావాలి..