Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎప్పుడూ నాకు కష్టాలు కలిగేట్లు చెయ్యి స్వామీ? ఎవరూ...?

సోమవారం, 5 జూన్ 2017 (20:49 IST)

Widgets Magazine
lord krishna

విపదః సంతు నః శశ్వత్ తత్ర తత్ర జగద్గురో|
భవతః దర్శనమ్ యత్‌స్యాత్ అపునర్భవ దర్శనమ్||
 
విపదః సంతు సః శశ్వత్ మాకెప్పుడూ కష్టాలు ఉండు గాక! అని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నది ఈ భక్తురాలు. ఈమె ఎవరో కాదు, కుంతీదేవి. భాగవతం ప్రథమస్కంధంలో 'కుంతీస్తవ'మని, శ్రీకృష్ణుణ్ణి కుంతీదేవి స్తుతించే సందర్భం వస్తుంది. ఆ శ్లోకాలూ వాటికి తెలుగు భాగవతంలో పోతన గారి అనువాదాలూ హృద్యంగా ఉంటాయి.
 
"అడుగడుగునా నన్నూ, నా బిడ్డల్నీ కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చావు గదా, నందనందనా, నీ ఋణం ఎలా తీర్చుకోనయ్యా! నీ కన్నతల్లి దేవకీదేవిని ఎలా అయితే కష్టాల నుంచీ, కంసుడి చెర నుంచి విడిపించావో, నన్నూ అలాగే రక్షిస్తూ వచ్చావు కదయ్యా! నిజానికి ఆమెని కొన్నేళ్ళు కష్టపడ్డ తర్వాత రక్షించావు, నన్నయితే ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికి కాపాడావు గదా!" అంటూ, కుంతి పై శ్లోకం కూడా చెప్తుంది.
 
జగద్గురు! విపదః సంతు నః శశ్వత్ - జనార్దనా, మాకు వివత్తులు ఎప్పుడూ ఉండుగాక!
తత్ర తత్ర భవతః అపునర్భవ దర్శనమ్ దర్శనమ్ యత్‌స్వాత్
 
(ఆపదలు వచ్చిన) ఆయా సందర్భాల్లో నీ అత్యద్భుత దర్శనము కలుగుతుంది గదా! నీ దర్శనం కలిగితే ప్రాణికి జన్మరాహిత్యమే కనుక మరో పుట్టుక చూసే అవసరం ఉండదు. 'కేవలం సుఖాలే కలిగితే వాటి ధ్యాసలో నిన్ను మర్చిపోతాను, కాబట్టి నాకు ఎప్పుడూ కష్టాలు కలిగేటట్లు చెయ్యి స్వామీ! అప్పడే నిన్ను నిరంతరం స్మరిస్తాను, భజిస్తాను. నీ దర్శనం పొందుతాను' అనేది నిజమయిన భక్తుడి ప్రార్థనయితే, అలాంటి భక్తులను కంటికి రెప్పలా కాపాడటం, ఆ భక్త వరదుడయిన జనార్దనుడి వంతు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

ఆ దానం చేస్తే లక్ష్మీదేవిని గెంటివేసినట్లేనట... ఈ దానాలతో సర్వనాశనం...

మానవ జన్మకు సార్థకత సాటి మానవుని మంచి కోరడమేనంటారు పెద్దలు. సాటి మానవుడు కష్టాల్లో ఉంటే ...

news

దేవునికి తైల లేపనం చేసిన నూనెను ఏం చేయాలి?

దేవునికి... ముఖ్యంగా శనీశ్వరునికి తైలాభిషేకం చేయించి, ప్రసాద రూపంగా తైలాన్ని ఇస్తారు. ...

news

కాణిపాక ప్రసాదంలో మేకు... ప్రశ్నించినందుకు ఏమన్నారా తెలుసా..?!

కాణిపాక వరసిద్ధి వినాయకుడు. స్వయంభువుగా వెలసిన దేవుడు. కాణిపాకం గురించి తెలియని ...

news

వెనక్కి తిరిగి చూస్తే ఆ ఆలయ గోపురం మీ వెనుకే వచ్చేస్తుంది...ఎక్కడ?

తమిళనాడులోని కడలూర్ జిల్లాలోని చిదంబరం గురించి చెప్పగానే నటరాజ స్వామి గుర్తుకు వస్తారు. ...

Widgets Magazine