Widgets Magazine

ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్లేటపుడు ఆ పని చేస్తే అనుకున్నది నెరవేరుతుంది...

మంగళవారం, 29 మే 2018 (11:59 IST)

లక్ష్మీదేవీ కటాక్షం కోసం చేయలసినవి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. సంధ్యాసమయంలో ఇల్లు శుభ్రం చేసే కార్యక్రమాలు చేయకుండా, దానికి పూర్వమే దీపాన్ని వెలిగించాలి. దేవీదేవతలకు ధూప, దీపహారతులు ఇవ్వాలి. ఏ పని కోసమైనా ఇంటినుండి బయటకు వెళ్ళేముందుగా, ఇంటిని చీపురుతో శుభ్రం చేసుకోవాలి. పరగడుపున కార్యార్థం బయటికి వెళ్ళకూడదు. కనీసం చెంచా తీయని పెరుగును నోటిలో వేసుకునే వెళ్ళాలి. ఇలా చేయడం వలన మీరు అనుకున్న కార్యాలు శుభంగా జరుగుతాయి. 
 
లక్ష్మీకటాక్షాన్ని దక్కించుకోవాలంటే మహాలక్ష్మీకి తులసి పత్రాన్ని, తులసి మంజరిని సమర్పించాలి. సాధనా, పూజా, ప్రార్థనా సమయంలో మీ ముఖం తూర్పుపైపుగా ఉండాలి. గురువారం రోజు ఏ మహిళనైనా పిలిచి మంగళకరమైనది ఏదైనా ఒకటిదానం చేయాలి. దీన్ని క్రమబద్ధం చేసుకుంటే మంచిది. తెల్లని వస్తువులు దానం చేస్తే లక్ష్మీకటాక్షం కలుగుతుంది. ధన సంబంధమైన కార్యాలన్నింటికీ సోమవారం, బుధవారలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. 
 
ప్రతి శనివారిం ఇంటిని శుభ్రపరుచుకోవాలి. సాలెగూళ్ళు, మట్టి, చెత్త, విరిగిపోయిన వస్తువులన్నీ సర్ది చక్కబరుచుకోవాలి. మీ ఇంటి సింహద్వారం దగ్గర లోపలివైపు, శ్రీ గణేశుడిని ఉంచాలి. ఆయన ముఖం మీ ఇంటిని చూస్తున్నట్లుగా ఉంచాలి. ఇలా ఇంటిని సర్దేసి, శుభ్రం చేసుకుంటే తెల్లవారు, సంధ్యాసమయాల్లో దీపాలను వెలిగించి, నిష్ఠతో పూజచేస్తే మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అంతేకాకుండా ధనవంతులవుతారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

ప్రతికూలత ఎక్కడైతే వుంటుందో అక్కడే విజయం... స్వామి వివేకానంద

1. ప్రతిఘటన, వ్యతిరేకత ఎంత ఉంటే అంత మంచిది. ప్రతిఘటన లేనిదే నదికి వేగం వస్తుందా... ఒక ...

news

వెయ్యి మంది భక్తులలో నిజంగా ముక్తి కోసం ప్రయత్నించేవారు...

వెయ్యి మంది భక్తులలో నిజంగా ముక్తి కోసం ప్రయత్నించేవాడు ఏ ఒక్కడో ఉంటాడని ద్వాపర యుగంలోనే ...

news

ఆధ్యాత్మిక వాస్తు చిట్కాలను పాటిస్తే?

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని బ్రహ్మ స్థానం అని పిలుస్తారు. ఈ ...

news

పేదలు పండగ చేస్కుంటున్నారు... జూన్ 1 నుంచి 12 లక్షల కుటుంబాలకు రంజాన్ తోఫా

అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో నవ్యాంధ్ర పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రూ.16 ...

Widgets Magazine