శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : గురువారం, 9 ఆగస్టు 2018 (17:26 IST)

సాయిబాబా మహిమాన్వితం...

భారతదేశంలో కనీవినీ రీతిలో మహిమాన్వితమైన శక్తులతో మానవ రూపం దాల్చిన దైవ స్వరూపంగా భక్తుల పూజలందుకునే అత్యున్నతమైన సాధువుగా శ్రీ సాయిబాబా కొలవబడుతున్నారు. ఈ నిగూఢమైన ఫకీరు తొలిసారిగా తన దర్శనాన్ని యవ్వన దశలో ఉండగా షిరిడీ గ్రామంలో కనిపించారు.

1918వ సంవత్సరంలో సమాధి చెందేంతవరకు తనను ఆశ్రయించిన భక్తులను ప్రేమానురాగాలతో ఆశీర్వదించి వారి జీవితాల్లో కొత్త వెలుగులు చూపించేవారు. అత్యవసర సమయంలో బాబాను పిలిచినట్లయితే వెంటనే ఆదుకుంటానని చెప్పడం ద్వారా భక్తుల హృదయాలలో బాబా చిరస్థాయిగా నిలిచిపోయారు. అందరికి ఆశీర్వచనాలు అందించడమై తన ధ్యేయంగా బాబా ప్రవచించారు.
 
ఆశ్రితులకు రక్షణ, ప్రమాదాలను నివారించుట, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుట, ప్రజలందరిలో సమైక్య భావనను పాదుకొల్పుట తనను ఆశ్రయించిన వారికి ఆధ్యాత్మిక భావనలను కల్పించడం ద్వారా తాను చేసిన ప్రవచనానికి కార్యరూపం ఇచ్చారు. తన మాటలతో, చర్యలతో సాధకులకు మోక్ష మార్గాన్ని చూపిన ఆధ్యాత్మిక పథ నిర్దేశకుడు సాయిబాబా.