Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నమామీశ్వరం సద్గురుమ్ సాయినాధమ్

బుధవారం, 24 జనవరి 2018 (22:29 IST)

Widgets Magazine

సదాసత్వ్సరూపం చిదానందకందం  
జగత్సంభవస్థాన సంహారహేతుమ్
స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం
నమామీశ్వరం సద్గురుమ్ సాయినాధమ్
saibaba
 
భావము : ఎల్లప్పుడూ అన్నింటికి ఆధారంగా ఏ నిజ తత్త్వమైతే ఉన్నదో ఆ నిజమే తానే అయిన వానికి, తాను తప్ప అన్యమేదిలేదు కనుక భయ, మమకారాదులు లేక, కోరికలు లేక, పూర్ణమైన తృప్తిలేక ఆనందమే తన స్వభావమే కలవానికి, చైతన్యమే తన లక్షణంగా కలవానికి, దుంప మొక్కంతటికి ఎలా మూలమో అలాగే చిదానంద గుణాలు కలిగి సృష్టికంతటికి మూలమైనవానికి, ఇట్టి ఏ మూలంలో నుండి సృష్టియనెడు మొక్క ఉద్భవించి తిరిగి అందులోనే లయించునో అట్టివానికి నామరూప వికారరహితమైన నిద్రలో నుంచి అనేక నామరూప సహితమైన మెలుకువ అనే స్థితి ఉద్భవించి తిరిగి అట్టి నిద్రలోనే లయించునట్లు సూక్ష్మములో చూసిన నిద్ర, మెలకువ, స్వప్నము అనే మూడు స్థితులకు సృష్టి, స్థితి, లయము అనే మూడు స్థితులకు ఏది ఆధారమైన తురీయము లేదా ఆత్మ అయివున్నదో అట్టి మూలస్థితి కలవానికి, తన భక్తుల కోరిక వలన లేదా ఆత్మను తెలుసుకోవలయునని తపించువారివలన మానవ రూపము ధరించి దర్శమిచ్చినట్టి వానికి సకలభూతముల యందుండి వాటినన్నింటిని నడిపించుట చేత సృష్టినంతటినీ నడుపునట్టు వానికి, సకల జగత్తునకు ఆధారమైనట్టి ఏ ఒక్క సత్యమైతే ఉన్నదో ఆ సత్యమనెడు గురురూపమున అవతరించునట్టి సకల మహాత్ములకు నాధుడైనట్టి సాయిబాబాకు నమస్కరించుచున్నాను.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Shirdi Saibaba Pray

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

45 నిమిషాల్లో తిరుమల శ్రీవారి దర్శనం.. తిరుమల గిరులు ఖాళీ...

తిరుమల గిరులపై ఒక్కోసారి ఒక్కో రకమైన అద్భుతం జరుగుతుంది. సాధారణంగా అయితే తిరుమల ...

news

అసలు పతివ్రతల కథలు ఎందుకు? (వీడియో)

మన పూర్వీకులు మేథావులు. దూరదృష్టి కలిగినవారు. వారు ఏర్పరచిన ఆచార సాంప్రదాయాలన్నీ ...

news

జనవరి 24న తిరుమలలో రథసప్తమి... సేవలన్నీ రద్దు... ఏడు వాహనాలపై శ్రీవారు

తిరుమల రథసప్తమికి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఉదయం ...

news

శరీరమనేది క్షణభంగుర స్వప్నం

జాతి-లక్షణ-దేశాలతో విభజనకాని, సమానంగా ఉండే వస్తువుల సైతం వేరువేరు అనే జ్ఞానంపై సంయమం వల్ల ...

Widgets Magazine