మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (10:48 IST)

మంగళవారం రోజున హనుమంతునికి పూజలు ఎందుకు చేస్తారో తెలుసా?

మంగళవారం హనుమంతుడికి ఎంతో ఇష్టమైన వారమని అంటారు. అందువలన ఈ రోజున ఈ స్వామిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. మంగళవారమై స్వామిని ఆరాధించడం వెనుక గల ఒక ఆసక్తికరమైన కథనం ఆధ్యాత్మిక గ్రంధాల్లో

మంగళవారం హనుమంతుడికి ఎంతో ఇష్టమైన వారమని అంటారు. అందువలన ఈ రోజున ఈ స్వామిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. మంగళవారమై స్వామిని ఆరాధించడం వెనుక గల ఒక ఆసక్తికరమైన కథనం ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తుంటుంది. ఓ మంగళవారం రోజున సీతమ్మవారు పాపిటన సిందూరం ధరించడం చూసిన హనుమంతుడు, అలా సిందూరం ధరించడానికి కారణమేమిటని సీతమ్మని అడిగాడట.
 
ఇలా సిందురాన్ని పెట్టుకుంటే శ్రీరాముని ఆయుష్షు పెరుగుతుందని అమ్మవారు చెప్పారు. అప్పుడు హనుమంతుడు వెంటనే అక్కడి నుండి వెళ్లి ఒళ్లంతా సిందూరాన్ని పూసుకుని వచ్చాడు. ఆ  సమయంలో అక్కడికి రామచంద్రుడు వచ్చాడు. హనుమను చూసి విషయమేమిటని అడిగాడు. అప్పుడు సీతమ్మవారు జరిగిన విషయాన్ని రామునికి తెలియజేశారు.
 
తనపై హనుమకు గల ప్రేమకి ఆనందంతో పొంగిపోయిన రాముడు, ఎవరైతే మంగళవారం రోజున సింధూరంతో హనుమంతునికి అభిషేకం చేస్తారో వాళ్ల ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయని సెలవిచ్చాడటయ. అలా శ్రీరామచంద్రుని వరం కారణంగానే మంగళవారం రోజున హనుమ పూజలందుకుంటున్నాడు.