మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By
Last Updated : సోమవారం, 5 నవంబరు 2018 (21:36 IST)

కాఫీ ఇస్తుంటే అతడి చేతిని అక్కడ తగిలించాడు... ఏం చేయాలి?

నా భర్త అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. నాకు, పిల్లలకు తోడుగా ఉంటాడని అతడి బంధువుల అబ్బాయిని ఇంట్లో ఉండమని చెప్పారు. అతడి చూపులన్నీ నాపైనే ఉన్నాయి. పెరట్లో నేను వంగి పనిచేస్తుంటే చాటుగా నా ఎదవైపు చూశాడు. అతడలా చూడటాన్ని నేను గమనించాను. దాంతో చటుక్కున వెళ్లిపోయాడు. 
 
మళ్లీ కాఫీ, టీలు అందిస్తున్నప్పుడు గబుక్కున అతడి చేతివేళ్లను నా ఎదకు కావాలనే తగిలించాడు. అంతేకాదు... నేను చాలా అందంగా ఉన్నానంటూ వెధవ చర్చ మొదలెట్టాడు. అతడి వాలకం చూస్తుంటే నాతో ఎలాగైనా శృంగారం చేయాలన్నట్లుగా ఉంది. రాత్రివేళల్లో నాపై ఏదయినా అఘాయిత్యం చేస్తాడేమోనని భయంగా ఉంది. అతడి నుంచి తప్పించుకోవడం ఎలా...?
 
మీకు తోడు అవసరం లేదని భర్తతో చెప్పేసేయండి. అతడి ప్రవర్తన బాగా లేనప్పుడు మీకు తోడు సంగతి ఎలా ఉన్నా... అతడితో ప్రమాదం పొంచి ఉంది. వెంటనే అతడిని ఇంటి నుంచి పంపివేయండి. మీ భర్త ఏమయినా అనుకుంటారని ఆలోచించవద్దు.