1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 4 నవంబరు 2018 (10:01 IST)

ఉదయం నిద్రలేవగానే కోల్డ్ కాఫీ తాగుతున్నారా..?

చాలా మందికి నిద్రలేవగానే కాఫీ తాగడం అలవాటు ఉంటుంది. నిద్రలేచి పడక దిగకుండానే కాఫీ, టీ తాగేవారు చాలా మందే ఉన్నారు. మరికొందరికైతే.. కాఫీ లేదా టీ తాగితేనే మలమూత్రాలు విసర్జించగలుగుతారు. అయితే, కాఫీల్లో ఏది బెస్ట్ అనే ప్రశ్న ఇపుడు ఉత్పన్నమైంది. ఉదయం నిద్రలేవగానే కోల్డ్ కాఫీ తాగితే మంచిదా.. హాట్ కాఫి తాగితే మంచిదా అనే దానిపై ఇపుడు వైద్యులు పరిశోధన చేయగా ఓ ఆసక్తికర విషయం తెలిసింది. 
 
ఉదయాన్నే లేవగానే వేడివేడిగా ఓ కప్పు కాఫీ లాగిస్తే కాస్త ఎనర్జీ వస్తుంది. అయితే ఇటీవలి కాలంలో కోల్డ్‌ కాఫీ తాగేవారి సంఖ్య పెరిగిపోతోంది. జీర్ణాశయ సమస్యలున్నవారు వేడి కాఫీ కంటే కోల్డ్‌ కాఫీ తాగడమే మేలనే కాఫీ కంపెనీలు, లైఫ్‌స్టయిల్‌ బ్లాగులు ప్రచారం చేస్తున్నాయి. 
 
అయితే అమెరికాలోని థామస్‌ జెఫర్సన్‌ వర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఇది తప్పని తేలింది. చల్లని కాఫీలో కంటే వేడి కాఫీలోనే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని వారు గుర్తించారు. ఈ యాంటిఆక్సిడెంట్లు కేన్సర్‌ సోకే ప్రమాదాన్ని, మధుమేహం, ఒత్తిడిని తగ్గిస్తాయని తెలిపారు.