గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By
Last Modified: శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (19:54 IST)

సారీ, అతడు నా ఫేస్ బుక్ ఫ్రెండ్... మీకు తెలియకుండా పిలిచా...

నాకు పెళ్ళయి 7 సంవత్సరాలు అయింది. ఒక పాప కూడా. నేను నా భార్య, పాప చాలా ఆనందంగా సంతోషంగా ఉంటాం. అలాంటిది 5 నెలలు నుంచి చాలా మార్పు వచ్చింది ఆవిడలో. ఫోన్ అంటే వాడటం ఇష్టం లేని తనకు చాలాసేపు వాట్సప్‌లో ఉంటుంది. దీన్ని కూడా నేను పట్టించుకోలేదు. మా సిస్టర్ నాకు చెప్పినట్లు ఈ రోజుల్లో హౌజ్ వైఫ్స్ హౌజ్‌లో బోరింగ్ ఫీల్ అవకుండా వుండేందుకు ఫోన్ యూజ్ చేస్తుందేమో అని అనుకున్నా.
 
కానీ సుధా అని ఒక వాట్సప్ నంబర్ చాలా లవ్ మెసేజెస్ వస్తుంటే అడిగా. నా ఫ్రెండ్ అని అంది. అలావుండగా ఒకరోజు నేను పని మీద హౌజ్‌కి వస్తి ఒక అబ్బాయి ఉన్నాడు. సుమారు ఒక 23 ఏళ్లు వుంటాయి. నేను ఏమిటి నీ పరిస్థితి అని అడిగా. మీ పెర్మిషన్ లేకుండా పిలిచినందుకు క్షమించండి. అతను ఫేస్ బుక్ ఫ్రెండ్ అంది. అపుడు కాస్త గొడవ కూడా పడ్డాం. అయినా కూడా తన తీరు మారలేదు.
 
ఫోనులో మాట్లాడటం వాట్సప్‌లో ఉండటం చేస్తోంది. మా కింద ఫ్లాట్లో ఉన్న అమ్మానాన్న, అన్నయ్యలు కూడా తాన తీరు బాగోలేదు చూస్కో అన్నారు. అలా అని నేను తనను తిట్టలేదు. 7 సంవత్సరాల్లో ఏ రోజు తనపై అనుమానం, కోపం రాలేదు. తనను నేను చాలా ప్రేమిస్తా.
 
ఒకరోజు ఫోన్ చూస్తే పాస్వర్డ్ పెట్టింది. నేను అడిగినా కూడా తనే ఫోన్ ఓపెన్ చేసి ఇచ్చింది. ఆ అబ్బాయికి తనే ఫొటోస్ అవి పెడుతుంది. నేను ఇంకా గట్టిగా అడిగా. అతనితో నాకు ఫ్రెండ్షిప్ మాత్రమే ఇంకా ఏమీ లేదు అని ఏడుస్తుంది. కానీ నాకు ఆమెపై చాలా అనుమానం వస్తుంది. నిజంగా నా వైఫ్ చెప్పినట్టు ఫ్రెండ్షిప్ అని అంటారా? ఆమె తప్పు చేసిందని నా మనసు చెప్తుంది. కానీ నేను ఆమెను ఏమీ అనలేకపోతున్నా. కారణం... మా గొడవలు వల్ల నా కూతురుకి తల్లిని దూరం చేస్తానేమోనని. ఆవిడను మార్చడం ఎలా?
 
సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, వాట్సప్‌లు వచ్చిన తర్వాత చాలామంది జీవితాలు ఇలాగే తయారవుతున్నాయి. వాటి పిచ్చిలో పడిపోతున్నారు. ముందుగా కొన్నాళ్లపాటు మీ ఇంట్లో నెట్ సౌకర్యం కట్ చేసేయండి. దాంతో ఈ అనవసర మెసేజింగులు ఇతరత్రా బెడద వదులుతుంది. ఏదయినా ఎమర్జెన్సీ సమాచారం అందించాలంటే ఎలాగూ కింది ప్లాట్లలోనే మీ కుటుంబ సభ్యులున్నారు కనుక ఇబ్బంది ఏమీ వుండదు. 
 
దీనికంటే ముందుగా మీ భార్యను తీసుకుని మీరు కొన్నాళ్లు విహారయాత్రకు వెళ్లండి. అక్కడ మీరు మరింత విపులంగా మాట్లాడుకునే సమయం దొరుకుతుంది. ఆమెపై అనుమానం వీడి, ఇలాంటి సందేశాలు, ఫోటోలు షేర్ చేయడం వల్ల కలిగే ముప్పు ఏమిటో తెలియజెప్పండి. ఇవన్నీ చేసి చూడండి... ఖచ్చితంగా ఆమె ప్రవర్తనలో మార్పు వస్తుంది.