ఆలోచనలతో బుర్ర వేడెక్కితే.. ఇలా చేయండి

మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (10:31 IST)

walking

ఆలోచనలతో బుర్ర వేడెక్కితే అదే పనిగా గంటల పాటు ఒకే చోట కూర్చోకండి. సమస్య పరిష్కారం కావాలంటే హ్యాపీగా నాలుగు అడుగులు వేయండి. ఆలోచన‌లు చేసీ చేసీ విసుగెత్తిపోయిన మెద‌డుకు కొత్త ఆలోచన రావాలంటే.. బయ‌ట‌కు వెళ్ల‌టం, న‌డ‌వ‌టం చేస్తే మెద‌డు తిరిగి ప‌దునెక్కుతుంద‌ని మానసిక నిపుణులు అంటున్నారు. సృజ‌నాత్మ‌కంగా ఆలోచించాలంటే అదే పనిగా ఆలోచ‌న‌ చేయకూడదని వారు సూచిస్తున్నారు.
 
బుర్రను వేడెక్కనీయకుండా చూస్తేనే.. అదే పనిగా ఆలోచించడాన్ని నిలిపేయాలి. మెదడు తేలిగ్గా ఉండే చిన్న‌పాటి ప‌నుల‌ను చేస్తూ ఉంటే మెద‌డు మ‌రింత చురుగ్గా త‌న ప‌ని తాను చేస్తుంది. అదే పనిగా ఆలోచిస్తూ వుంటే.. ఆలోచనలన్నింటిని పక్కనబెట్టి.. స్నానం, తోట‌ప‌ని లాంటివి చేస్తే.. మానసిక ఒత్తిడి దూరమవుతుంది. మెదడు ఆలోచనల ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఇలానే చేయాలని.. అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని మానసిక నిపుణులు అంటున్నారు.దీనిపై మరింత చదవండి :  
Pshycological Tips Bath Garden Walking Mind Fresh

Loading comments ...

ఆరోగ్యం

news

డయాబెటిస్ తగ్గాలంటే.. పెరుగు తీసుకోవాల్సిందే.. కానీ ఆ రెండు..?

మధుమేహాన్ని దూరం చేసుకోవాలంటే రోజువారీ ఆహారంలో పెరుగును తీసుకోవాల్సిందేనని ఆరోగ్య ...

news

గుమ్మడి చేసే మేలు... స్త్రీలకు, పురుషులకు...

తెలుగువారి యింటి ముంగిట గుమ్మడిపండును వ్రేలాడదీయడం మనం నిత్యం చూస్తాము. బూడిదగుమ్మడిలో ...

news

ఖర్జూర పండును తింటే కలిగే ప్రయోజనం ఏంటి?

1. ఖర్జూరపండులో ఎక్కువ పీచు పదార్థం వుంటుంది. 2. మూత్రం సాఫీగా కానివారికి ఖర్జూరపండు ...

news

ఆయిలీ స్కిన్‌.. బ్లాక్ హెడ్స్‌కు చెక్ పెట్టే కొత్తిమీర..

కొత్తిమీర వంటకాలకు మంచి వాసనను ఇవ్వడమే కాకుండా బరువును తగ్గించడంలో దివ్యౌషధంగా ...