శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 24 జులై 2014 (16:19 IST)

కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగినవి ఏంటో తెలుసా?

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవితంలో ఎన్నో మహిమలు జరిగినట్లు చెబుతారు. సృష్టి మొత్తం కాలం ఆధీనంలోనే వుంటుంది. కేవలం మహాజ్ఞానులకు, యోగులకు మాత్రమే కాల పురుషుని గురించిన జ్ఞానం ఉంటుంది. అటువంటి యోగి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. అందువల్ల ఆయన చెప్పిన కాలజ్ఞానం ఇప్పటికీ అత్యధికులకు అనుసరణీయంగా ఉంటోంది.  
 
కాలజ్ఞానంలో చెప్పినవి- ఇప్పటివరకు జరిగినవి ఏంటంటే?
 
కాశీ పట్నం 40 రోజులు పాడు పడుతుంది. 
1910-12 మధ్య గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. అదే సమయంలో కలరా ఆ ప్రాంతంలో వ్యాపించింది. దీనివల్ల కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్ళలేదు. 
 
ఒక అంబ పదారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది
ఇందిరాగాంధీ 16 సంవత్సరాలు భారతదేశానికి ప్రధానిగా వున్నారు.
 
తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. 
ప్రస్తుతం సినీ నటులు రాజకీయాల్లోకి చాలా ఎక్కువగా రావటం జరుగుతోంది. ప్రస్తుత తమిళనాడు సీఎం జయలలిత కూడా మాజీ నటి. అలాగే మన మాజీ సీఎం ఎన్టీ రామారావు కూడా సినీ రంగం నుంచి వచ్చినవారే. 
 
రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి. 
ఇప్పుడు భారతదేశంలో రాజుల పాలన ఎక్కడా లేదు. 
 
ఆకాశాన పక్షి వాహనాదులు కూలి అనేకమంది మరణిస్తారు. 
ప్రస్తుతం ప్రతిరోజూ ఏదో ఒక విమాన ప్రమాదం జరుగుతోంది. ఈ కారణంగా ఎంతోమంది మరణిస్తున్నారు. 
 
జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది 
ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. 
 
బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. 
ఇప్పటివారికి తెలియదు కానీ, వందేళ్ల క్రితం వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు వుండేవి. ప్రస్తుతం ఎక్కడా అగ్రహారాలు లేవు. 
 
హైదరాబాద్‌లో తురకలు, హిందువులు ఒకర్నొకరు నరుక్కుని చచ్చిపోతారు. 
15 ఏళ్ల క్రితం వరకు కూడా హైదరాబాద్‌లో మత కల్లోలాలు - అది కూడా కేవలం ముస్లిం- హిందువుల మధ్య మాత్రమే జరిగేవి. 
 
దేవస్థానాలు పాపాత్ముల వల్ల నాశనమవుతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి. 
విజయవాడ కనక దుర్గమ్మ గుడిలో చోరీ జరిగింది. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. 
 
చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ, చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు. సృష్టిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. 
అన్ని రకాల యంత్రాలూ వచ్చినా.. చనిపోయిన వారిని బతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటివరకు కనుగొనలేకపోయారు. 
 
రావణకాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పెట్టేను 
రావణుని దేశం అయిన శ్రీలంకలో తమిళ, లంకేయుల మధ్య కలహాలే.. చివరికి భారత ప్రధాని రాజీవ్ గాంధీని బలిగొన్నాయి.