గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2024 (12:56 IST)

శ్రీవారి భక్తులకు శుభవార్త.. శ్రీవారి మెట్టుమార్గం రీఓపెన్

tirumala
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా శ్రీవారి మెట్టు మార్గాన్ని తితిదే అధికారులు గురువారం మూసివేశారు. అయితే, శుక్రవారం మళ్లీ ఈ మార్గాన్ని తిరిగి తెరిచినట్టు అధికారులు వెల్లడించారు. నడకదారిన వెళ్లి భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చని తెలిపింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం నుంచి ఈ మార్గాన్ని అధికారులు తెరిచారు. 
 
మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. కాగా, గురువారం స్వామివారిని 58637 మంది దర్శనం చేసుకోగా, రూ.3.69 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.