శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 11 జులై 2014 (17:17 IST)

గురుపౌర్ణిమ: మీరు గురువులకు మర్యాద ఇస్తున్నారా?

వ్యాస పూర్ణిమ నాడు వ్యాసభగవానుడిని, గురు పరంపరనూ పూజించాలని పురోహితులు చెప్తున్నారు. గురువు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడ మనం భక్త కబీరు మాటను ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలి. “గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. “అన్నాడట కబీర్. ఎందుచేతనయ్యా అంటే గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా” అంటాడు భక్తకబీర్.
 
గురువులకు తల్లిదండ్రుల తర్వాతి స్థానం వుండేది. ఆ స్థానానికి ఇప్పటి సమాజంలో మర్యాద అంతంత మాత్రంగానే ఉందనే చెప్పాలి. ఉపాధ్యాయులకు మర్యాద ఇచ్చే విద్యార్థులు కరువయ్యారనే చెప్పాలి. గురువులకు మర్యాద ఇస్తే ఆ పరమాత్మనే పూజించినంత ఫలితం దక్కుతుంది. 
 
సమాజంలో ఎన్నో మార్పులొచ్చినా చదువు చెప్పిన గురువుకి నమస్కరించడం, వినయంగా, విధేయతను ప్రదర్శించడం చేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు మీరు గురువులను మర్యాదించకపోయినా పర్లేదు. ఇకనైనా గురువుకు మర్యాద ఇస్తే సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని పురోహితులు సూచిస్తున్నారు. 
 
మీ గురువులకు ప్రత్యేకించి పూజలు పునస్కారాలు గాకుండా.. మర్యాద, గౌరవం ఇవ్వడం చేయాలి. మీకు వీలైతే మీ గురువులకు చిన్నపాటి కానుకలు ఇవ్వొచ్చునని పండితులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుత సమాజంలో గురువులూ.. వారి స్థాయికి తగ్గట్లు నడుచుకోవాలని పురోహితులు సూచిస్తున్నారు.