శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 21 మే 2015 (14:35 IST)

నిద్రకు సమయం ఉండాలి.. ప్రకృతితో అనుబంధాన్ని పెంచుకోండి..!

నిద్రకు తప్పకుండా ఓ సరైన పద్ధతి ఉండాలని ఆధ్యాత్మిక పెద్దలు అంటున్నారు. అలాగే ప్రతిరోజూ మిగిలిపోయిన ఆహార పదార్థాలు కాకుండా తాజాగా వండిన వాటిని తీసుకోవాలి. అది కూడా పూర్తిగా ఉడికించినది కాక, ఓ మోస్తరు తక్కువగా ఉండాలి. మసాలా దినుసుల వాడకం తగ్గాలి. మనం సృష్టించే మానసిక శక్తికి మూలం ఆహారం అందించే శక్తి, ఈ మూల పదార్థం మెరుగ్గా ఉంటే శక్తికూడా చక్కనిదై ఉంటుంది. 
 
ఆహారపు నియమంతో పాటు నిద్రకి సమయం అవసరం. ప్రతిరోజూ నిర్ణీత సమయంలో పడుకుని వేకువజామునే లేవటం అలవాటు చేసుకోవాలి. అనంత విశ్వంలో ఏముందో మానవాళి తెలుసుకోవాలి. అందుకే ప్రతిరోజూ ఉదయం ప్రశాంత వాతావరణంలో, శుభ్రంగా స్నానం చేసి ఆధ్యాత్మిక చింతనను పెంచే గ్రంథాలను పఠించండి. అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు.

అలాగే ప్రకృతితో అనుబంధాన్ని మరింత పెంచుకోండి. ప్రకృతి మూలాల నుంచే జీవం పుట్టింది. అందులోనే మళ్లీ జీవులు కలిసిపోతాయి. తాత్కాలికంగా లభించిన ఆలోచనలు, విజయాలను చూసుకుని ప్రకృతికి వ్యతిరేకంగా ఎవ్వరూ తయారుకాకూడదు. ఉదయం వేళ మొక్కలతో సమయం గడపండి. మొక్కలతో పాటు చుట్టూ కనిపించే చిన్న, పెద్ద జంతువులను గమనిస్తూ వాటికి ఆహారం అందిస్తూ మానసిక ప్రశాంతత అందుకోవడానికి ప్రయత్నించండి.