Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్య సాయంత్రం ఇలా చేస్తే దేవుడు కూడా కాపాడలేడట...

మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (16:35 IST)

Widgets Magazine
goddess lakshmi

మనం చేసే పనే మనలో ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతుందట. ఇంట్లో ఆడవారు చేసే పనులో కష్టాలను తెచ్చిపెడతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇంట్లో భార్య కొన్ని చేయకూడని పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో రావడానికి నిరాకరిస్తుంది. సాయంత్రంలో ఇంటిలోని పక్కింటి వారు పాలు, పెరుగు అడిగితే ఇస్తూ ఉంటారు. పాలు లక్ష్మీదేవితో సమానం... అలాంటి పాలు.. పెరుగును వేరే వారికి ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటకు పంపినట్లే. ఇలా చేసేవారి ఇంట ఎట్టి పరిస్థితుల్లోను లక్ష్మీదేవి ఉండదు. వెంటనే అలిగి వెళ్ళిపోతుందట.
 
వంటింట్లో ఆహారాన్ని వండుతారు. అంటే వంటింట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి సాయంత్రం నిద్రపోయే ముందు వంటపాత్రలు, వంటగది, స్టౌను ఖచ్చితంగా శుభ్రం చేయాలి. అలా చేసిన తరువాతే నిద్రపోవాలి. ఇలా చేయకుంటే లక్ష్మీదేవి అలుగుతుంది. అలాగే ఇంట్లో మహిళలు జుట్టును విరబోసుకుని నిద్రపోతారు. సౌకర్యంగా ఉంటుందని. కానీ ఇలా అస్సలు చేయకూడదు. జుట్టు విరబోసుకుని పడుకోవడం మనషులు చేసే పనికాదు రాక్షసులు చేసే పని.
 
రాక్షస కృత్యాలు చేసే వారి ఇంట లక్ష్మీదేవి ఎక్కువకాలం నిలవదు. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అందుకే ఉప్పును రాత్రి వేళల్లో చిన్న పొట్లాలుగా కట్టి అన్ని గదుల్లోను ఉంచాలి. తెల్లవారిన తరువాత ఇంట్లో గృహిణి ఎవరితోను మాట్లాడకుండా ఉప్పును తీసి పారెయ్యాలి. ఇలా చేస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. 
 
అలాగే చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి. వేరే ఏ దిక్కున ఉండకూడదు. అలా ఉంచితే ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది. నిద్రపోయేటప్పుడు కొంతమంది తల దగ్గర నీటిని పెట్టుకుంటారు. నిద్ర లేచి తాగుదామని.. కానీ అలా చేయకూడదు. నీళ్ళ దప్పిక వస్తే పైకి లేచి వెళ్ళి తాగాలి. ఇలా చేస్తే ధనప్రాప్తి ఖచ్చితంగా లభిస్తుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

విళంబి నామసంవత్సరం.. ఏ పండుగ.. ఏ తేదీలో...

తెలుగు కొత్త సంవత్సరం విళంబి నామ సంవత్సరంలో వచ్చే పండుగ తేదీలపై వివాదం నెలకొనివుంది. ...

news

నవరాత్రుల్లో ఏడవరోజు.. కాళరాత్రిని పూజిస్తే..(వీడియో)

నవరాత్రుల్లో ఏడవ రోజున (సెప్టెంబర్ 27) కాళరాత్రి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈమెను ...

news

నవరాత్రుల్లో ఆరో రోజు కాత్యాయనీ దేవిగా అమ్మవారు... కన్యలు పూజిస్తే?(వీడియో)

నవరాత్రుల్లో ఆరవ రోజున (సెప్టెంబర్ 26) దుర్గా మాత అవతారమైన కాత్యాయనీ మాతని పూజిస్తారు. ...

news

పితృదోషాలను తొలగించుకోవాలంటే.. మహాలయ అమావాస్య నాడు ఇలా చేయండి..

పితృదోషమనేది ఈతిబాధలను కలిగింపజేస్తుంది. ఇంట్లో వున్నవారికి ఆర్థిక ఇబ్బందులు, ...

Widgets Magazine