శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By JSK
Last Modified: మంగళవారం, 25 అక్టోబరు 2016 (19:01 IST)

కార్తీక మాసంలో శివునికి వేటితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు...?

కార్తీక మాసం పరమ శివునికి ప్రీతికరమైన మాసం. కార్తీక మాసం అన్ని రోజులలో వేకువ ఝాముననే నిద్ర లేచి, సూర్యోదయంలోగా స్నానమాచరించి, విభూతిని ధరించి, శివాలయమునకు వెళ్ళి కార్తీక దీపం వెలిగించి, పరమ శివుని అభిషేకమును దర్శించి, తీర్ధమును తీసుకొని ఇంటికి వచ్చి

కార్తీక మాసం పరమ శివునికి ప్రీతికరమైన మాసం. కార్తీక మాసం అన్ని రోజులలో వేకువ ఝాముననే నిద్ర లేచి, సూర్యోదయంలోగా స్నానమాచరించి, విభూతిని ధరించి, శివాలయమునకు వెళ్ళి కార్తీక దీపం వెలిగించి, పరమ శివుని అభిషేకమును దర్శించి, తీర్ధమును తీసుకొని ఇంటికి వచ్చి కార్తీక పురాణం కథను చదువుకొని ఆ తరువాత మిగిలిన కార్యక్రమాలకు ఉపక్రమించాలి. అలాగే సాయంత్రం వేళ కూడా వీలయితే దేవాలయాలలో, లేని పక్షంలో ఇంటి వద్ద కార్తీక దీపం తప్పక వెలిగించాలి. కార్తీక సోమవారములు, కోటి సోమవారం, కార్తీక పౌర్ణమి పర్వదినములలో ఉపవాసం ఉండటం శ్రేష్ఠము. ఆ పర్వదినములలో దీప దానం, సముద్ర స్నానం పుణ్య ఫలితాన్నిస్తుందని పెద్దల ఉవాచ. 
 
పరమ శివుడు అభిషేక ప్రియుడు. కార్తీక మాసం లో ఒక్కసారైనా పరమశివునికి నమక చమక సహిత ఏకాదశ రుద్రాభిషేకం శివాలయంలో చేయించాలని పెద్దల ఉవాచ.
 
శివాభిషేక ఫలములు :
గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును.
చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ధి కలుగును.
మెత్తని చక్కెరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగును.
పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
 
అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది(మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన.
 
ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
నవరత్నోదకముచే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.