శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (13:34 IST)

రాత్రిపూట చెత్తను బయట పారేయకండి

ఇంటిని శుభ్రంగా వుంచుకోవడం ఓ కళ. ప్రస్తుతం మహిళలు సైతం పురుషులకు పోటీగా ఉద్యోగాలకు వెళ్లడం ద్వారా ఏపనికి వేళా పాళా అంటూ లేకుండా పోయింది. టైమ్ దొరికినప్పుడల్లా పనిచేసేసుకోవడంలోనే మహిళలు శ్రద్ధ చూపుతున్నారు. ఇందులో భాగంగా ఆచార వ్యవహారాలను సైతం పక్కనబెట్టేస్తున్నారు. 
 
కానీ టైమ్ లేదంటూ రాత్రిపూట ఇళ్లంతా శుభ్రం చేసి చెత్తను బయట వేసే వారు మీరైతే ఈ స్టోరీ చదవండి. సాధారణంగా ఉదయాన్నే ఇల్లు ఊడ్చి ఆ చెత్తను బయట పారవేసి శుభ్రం చేసిన తరువాత పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలాగే సాయంత్రం కూడా ఇల్లు ఊడ్చిన తరువాత పూజ గదిలో దీపారాధన చేస్తుంటారు. ఇక చాలా మంది తీరిక లేదంటూ రాత్రి సమయాల్లో ఇల్లు శుభ్రంగా ఊడ్చి ఆ చెత్తను అవతల పారేస్తూ వుంటారు. అయితే ఈ విధంగా చేయడం తప్పని శాస్త్రం చెబుతోంది.
 
లక్ష్మీదేవి రాత్రి సమయాల్లో వస్తుందనే విశ్వాసం చాలామందిలో వుంది. ఆ సమయంలో ఆమెకి చెత్త పట్టుకుని ఎదురు పడకూడదనే ఉద్దేశంతోనే, రాత్రి వేళల్లో చెత్తను బయటవేయరాదని పండితులు అంటున్నారు.