శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: సోమవారం, 20 జూన్ 2016 (23:05 IST)

ఆంజనేయునికి ప్రీతిప్రదం తమలపాకులు... ఎందుకంటే...?

హిందూ సంప్రదాయ పూజలలో తాంబూలానిది అగ్రస్థానం. అందరు దేవుళ్ళకి తమలపాకులతో పూజలు చేయటం ఉన్నప్పటికీ, ఆంజనేయస్వామికి ఆకు పూజ అత్యంత ప్రీతికరం. ఒకనాడు సీతమ్మ శ్రీరామునికి తమలపాకులు చిలుకలు చుట్టి ఇస్తుండగా వాటిని ప్రీతికరంగా సేవిస్తున్న ఆ స్వామి నోరు పండి

హిందూ సంప్రదాయ పూజలలో తాంబూలానిది అగ్రస్థానం. అందరు దేవుళ్ళకి తమలపాకులతో పూజలు చేయటం ఉన్నప్పటికీ, ఆంజనేయస్వామికి ఆకు పూజ అత్యంత ప్రీతికరం. ఒకనాడు సీతమ్మ శ్రీరామునికి తమలపాకులు చిలుకలు చుట్టి ఇస్తుండగా వాటిని ప్రీతికరంగా సేవిస్తున్న ఆ స్వామి నోరు పండిందట. ఇది చూసిన ఆంజనేయుడు శ్రీరాముడిని చూసి స్వామీ ఏమిటిది మీ నోరు ఎందుకు అంత ఎర్రగా అయ్యింది అని అడిగాడట. 
 
అందుకు శ్రీరాముడు సమాధానమిస్తూ తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుందని సమాధానం సెలవిచ్చాడట. దీంతో ఆంజనేయుడు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయి కొంత సమయం తరువాత వొంటి నిండా తమలపాకులు చుట్టుకొని వచ్చాడట. ఆంజనేయునికి తమలపాకు తోటలలో, అరటి తోటలలో ఆనందంగా విహరిస్తాడు. 
 
రుద్ర సంభూతుటైన ఆంజనేయుడు తమలపాకులు శాంతిని చేకూరుస్తాయి. కాబట్టి తమలపాకులతో ఆంజనేయస్వామిని పూజించడం వలన శాంతి సౌఖ్యాలు సిద్ధిస్తాయి. అలాగే తమలపాకులకు నాగవల్లీ దళాలు అనే మరొక పేరు కూడా ఉంది. తమలపాకులతో ఆంజనేయస్వామిని పూజిస్తే నాగదోష శాంతి కలుగుతుంది.