1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 4 డిశెంబరు 2018 (21:27 IST)

నవగ్రహ శాంతికి అది పాటిస్తే....

నవగ్రహాలు భూమిపై నివసించే మానవాళి మనుగడపై ప్రభావం చూపుతుంటాయి. ఆయా గ్రహాల అనుగ్రహం లేకపోతే సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. గ్రహ సంబంధమైన దోషాల కారణంగా ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన సమస్యలు సతమతం చేస్తుంటాయి. అంతేకాకుండా వివాహంలో ఆలస్యం, సంతానం లేమి వంటి సమస్యలు బాధిస్తుంటాయి. తలపెట్టిన కార్యక్రమాలు మధ్యలోనే నిలిచిపోతుంటాయి.
 
అందువలన చాలామంది నవగ్రహాలకు ప్రదక్షణలు చేస్తుంటారు. అలానే అభిషేకాలు జరుపుతుంటారు. గ్రహ శాంతులు చేయిస్తుంటారు. ఇలాంటి గ్రహదోషాల నుండి విముక్తి కలిగించే మార్గాలలో ఒకటిగా నవగ్రహ చాలీసా అని ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పబడుతోంది. అనునిత్యం నవగ్రహాల చుట్టూ తొమ్మిది దీపాలు వెలిగించి నవగ్రహాలకు నమస్కరిస్తూ నవగ్రహ చాలీసాను పఠించవలసి ఉంటుంది. 
 
ఇలా చేయడం వలన గ్రహదోషాలు సంబంధమైన దోషాలు తొలగిపోయి ఆశించిన ఫలితాలు కనిపిస్తాయని శాస్త్రంలో చెప్పబడుతోంది. నవగ్రహాలకు ప్రదక్షణలు, పూజలు, దీపారాధనలు చేయడం వలన మీరు తలపెట్టిన కార్యక్రమాలు నిలిచిపోకుండా సంతోషంగా జరిగిపోతాయి. జీవితంలో ఎటువంటి ఆటంకాలను ఎదుర్కోవలసి ఉండదు.