శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By PNR
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (17:11 IST)

ముఖం తిప్పుకునేవారి పట్ల అభిమానంగా ఉండటమెలా?

చాలా మంది చిరునవ్వుతో పలకరించినా ఏమాత్రం మొహమాటం లేకుండా ముఖం తిప్పుకుంటారు. ఇలాంటి వారి పట్ల అభిమానంగా ఉండటమెలా అనే అంశాన్ని పరిశీలిస్తే... ఒకరిని ప్రేమించడం లేదా ద్వేషించడం అనేది మీ వ్యక్తిత్వంపై ఆధారపడివుంటుంది. దీన్ని బహిరంగంగా వ్యక్తపరచాల్సిన అవసరం లేదు. సాధారణంగా ప్రేమ ఎదురు చూడదు. ప్రతిఫలం ఆశించదు. అలాగే, ఎదుటివాళ్లు మీ మీద ప్రేమ కలిగివుండాలన్న నిబంధనేదీ లేదు. 
 
వెయ్యి మందికి వంట చేసి పెట్టినా.. ఇంట్లో ఇద్దరికి వంట చేసిన పెట్టినా ఒకే ప్రేమను చూపాలి. కోపం తెప్పించే పనులు ఎదుటివాళ్లు చేసినా.. నీ కంటే నేను గొప్పవాణ్ణి అని నిరూపించుకునే పని చేయకూడదు. అలాగే, ఈ ప్రపంచంలోని అందరూ ప్రేమించే మనస్సు కలిగివుండాలన్న నిబంధనేదీలేదు. అందువల్ల ఎదుటి వ్యక్తి మన పట్ల ఎలా ప్రవర్తించినా మన ప్రవర్తనలో మాత్రం మార్పు రాకుండా నడుచుకోవడమే ఉత్తముని లక్షణం.