శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 13 జూన్ 2015 (17:38 IST)

దుర్యోధనుడి ఆతిథ్యాన్ని శ్రీ కృష్ణుడు స్వీకరించలేదు.. ఎందుకని?

''అన్నమయం హి సౌమ్య మనః'' అని ఉపనిషత్తు చెబుతోంది. ఎటువంటి అన్నం తింటే ఆ విధంగానే మనస్సు ప్రవర్తిస్తుందని భావం. కృష్ణుడు హస్తినాపురానికి వస్తున్నాడని తెలియగానే, ఆయన్ని లోబరుచుకునేందుకు దుర్యోధనుడు అందరి కంటే ముందుగా వెళ్ళి మేము ఇచ్చే ఆతిథ్యానికి రావలసిందిగా కోరాడు. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా అన్నాడు.
 
'' దుర్యోధనా శత్రుపక్షం నుంచి నేను రాయబారిగా వచ్చినవాడిని. నీ ఇంట ఆతిథ్యం తీసుకుని వాల్ళ ఇంటిమాటలు నీకెలా చెప్పగలను? పైగా నీ ఇంట ఆతిథ్యం తీసుకున్నానే అనుకో. నాకైదా ఆరోగ్యలోపం జరిగితే నేనేమీ అనుకోకపోయినా లోకం నిన్నే అనుకుంటుందిగా. అది శ్రేయస్కరం కాదు. పైగా నేను వస్తున్నానన్న విషయం తెలిసి కుంతీదేవి విరుదుని ఇంట భోజనాన్ని సిద్ధంచేసిందట. నేవస్తా'' అంటూ వెళ్ళిపోయాడట. 
 
ఇది చెప్పడానికి కారణం ఏమిటంటే.. దుర్మార్గపు ఆలోచనలు, అధర్మార్జనా, కృతఘ్నతతో నిండిన దుర్యోధన ఆతిథ్యంవల్ల తనకీ అలాంటి ఆలోచనలే కలగవచ్చని.. కనుక ధర్మబద్ధమైన భోజనాన్ని మాత్రమే చేయాలి.