శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (17:39 IST)

శ్రీవారి జుట్టు అస్సలు చిక్కు పడదట: సముద్రపు ఘోష...

తిరుమలలో వెలసిన కలియుగ వైకుంఠ నాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి మహిమలు ఎన్నో ఉన్నాయి. వీటిలో భక్తులకు తెలిసినవి కొన్ని అయితే తెలియనవన్నీ ఎన్నో వుంటాయి. స్వామివారి గర్భగుడి రహస్యాలు అనేకమని పండితులు అంటున్నారు. ఈ క్రమంలో శ్రీవారి మూలవిరాట్టుకు సహజసిద్ధమైన జుట్టు ఉంటుందని, అవి అస్సలు చిక్కుపడవని పండితులు అంటారు. 
 
అలాగే స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50 వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. ఈ సేవా టిక్కెట్లను చాలా తక్కువ మందికే అమ్ముతారు.
 
ఇకపోతే.. స్వామి వారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది.