ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (19:51 IST)

స్కంద షష్ఠి.. ఫిబ్రవరి 15 గురువారం 12 గంటల వరకు.. పూజ ఇలా?

Lord Muruga
స్కంద షష్ఠి అనేది కుమార స్వామిని పూజించే తిథి. ప్రతి నెలా షష్ఠి రోజున కుమార స్వామిని పూజించేవారికి సకల శుభాలు చేకూరుతాయి. నెలవారీగా శుక్ల పక్ష ఆరో రోజును స్కంధ షష్ఠిగా పరిగణిస్తారు. అలాంటిది ఫిబ్రవరి 2024లో, స్కంద షష్ఠి ఫిబ్రవరి 14న వస్తుంది. ఫిబ్రవరి 15 గురువారం 12 గంటల వరకు వుంటుంది. 
 
సూర పద్ముడు అనే రాక్షసుడిని సంహరించిన కారణంగా భక్తులు కుమార స్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్సాహంగా జరుపుకునే రోజునే స్కంధ షష్ఠి అంటారు. సూర పద్ముడిపై కుమార స్వామి ఆరు రోజుల యుద్ధం చేశాడు. చివరికి అతనిని ఓడించాడని పురాణాలు చెప్తున్నాయి. 
 
స్కంద షష్ఠి నాడు, భక్తులు ఉదయాన్నే నిద్రలేచి, శుభ్రమైన బట్టలు ధరించి, పూజాగదిని పూజకు సిద్ధం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్టించి, పూలతో అలంకరించి, నెయ్యి దీపాలు, ధూపాలను వెలిగిస్తారు. 
 
పండ్లు, స్వీట్లు నైవేద్యంగా పెడతారు. స్కంద పురాణం, స్కంధ షష్ఠి కవచం పారాయణం చేస్తారు. అలాగే కుమార స్వామి ఆలయాలను దర్శించుకుంటారు.