శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2015 (14:46 IST)

శ్రీకృష్ణాష్టమి రోజున ఆ శ్లోకాన్ని స్మరిస్తే..

భగవద్గీత సమస్త ఉపనిషత్తుల సారం. నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు భగవద్గీతలో సమాధానాలు దొరుకుతాయి. భగవద్గీత అనుక్షణం మన ఆలోచనని, ఆచరణని ప్రభావితం చేయగల ఒక మహత్తర సాధనం. గీతాసారాన్ని మనసున నింపుకోగలిగితే జీవితంలో సంతోషాన్ని నింపుకోవడం ఎలాగో తెలిసిపోతుంది. శ్రీకృష్ణ పరమాత్మ రణరంగాన అర్జునుడికి గీతోపదేశం గీతను శ్రీకృష్ణాష్టమి రోజున చదివితే కోరిన కోరికలు నెరవేరుతాయి. భగవద్గీత మొత్తం చదవలేనివారి కోసం ‘సప్తశ్లోకీ గీత’ని అయినా నిత్యం ఒక్కసారి పఠిస్తే చాలు. సమస్త కోరికలు తీరతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.  
 
ఓం మిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ | 
యఃప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిమ్ || 1
 
స్థానే హృషీకేశ! తవ ప్రకీర్త్యా, జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ |
రక్షాంసి భీతాని దిశో ద్రవంతి, సర్వే సమస్యంతి చ సిద్ధసంఘాః || 2
 
సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖమ్ | 
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి || 3 
 
కవిం పురాణమనుశాసితారమణోరణీయాంసమనుస్మరేద్యః | 
సర్వస్య ధాతారమచింత్యరూపం, ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ || 4 
 
ఊర్ధ్వమూలమధశ్శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయమ్ | 
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ || 5 
 
సర్వస్య చాహం హృది సన్నివిష్టో, మత్తః స్మృతిర్‌జ్ఞానమపోహనంచ | 
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో, వేదాంతకృద్వేదవిదేవ చాహమ్ || 6 
 
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు | 
మామేవైష్యసి యుక్వై మాత్మానం మత్పరాయణః || 7 
 
ఇతి శ్రీ మద్భగవద్గీతానూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం
యోగశస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే సప్తశ్లోకీ గీతా ||