శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2016 (09:37 IST)

సాయినాధునికి ప్రీతి పాత్రం... గురువారం నాడు సాయి పూజ ఎలా చేయాలంటే....?

గురువారం నాడు సాయినాధుని ప్రార్థన చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అసలు గురువారం నాడు ఈ ప్రార్థన, పూజ ఎలా చేయాలంటే... ఒక పలకను సింహాసనంగా అమర్చి వస్త్రమున్ని దానిపై పరిచి ఆపైన సాయినాధ

గురువారం నాడు సాయినాధుని ప్రార్థన చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అసలు గురువారం నాడు ఈ ప్రార్థన, పూజ ఎలా చేయాలంటే... ఒక పలకను సింహాసనంగా అమర్చి వస్త్రమున్ని దానిపై  పరిచి ఆపైన సాయినాధుని పటాన్ని, విగ్రహాన్ని పెట్టాలి. ఆ తర్వాత నుదిటిపై చందనాన్ని, తిలకాన్ని దిద్ది పూలమాలలను, పసుపు ఇత్యాది వాటిని సాయిబాబాకు సమర్పించాలి. 
 
ఆ తర్వాత దీపస్తంభంలో సాయిజ్యోతిని వెలిగించాలి. అటు తర్వాత సాంబ్రాణి, అగరు ధూపములను సమర్పించి... చక్కర, మిఠాయి వంటివి నైవేద్యంగా పెట్టాలి. ఆచరించు భక్తుడు ఒకే పూట భోజనం చేయాలి. అంతేతప్ప కడుపు మాడ్చుకుని ఈ వ్రతాన్ని చేయకూడదు. వ్రతం చేసిన తర్వాత నైవేద్యాన్ని వ్రతములో కూర్చున్నవారికి పంచాలి. ఇలా తొమ్మిది గురువారాలు ఈ వ్రతాన్ని చేయాలి.