శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 నవంబరు 2014 (19:47 IST)

తిరుచానూరు బ్రహ్మోత్సవాలు : ఆకట్టుకుంటున్న పూల ప్రదర్శన!

పద్మావతీ అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలలోభాగంగా తిరుచానూరులో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన పూల ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ పూల ప్రదర్శన కార్యక్రమాన్ని రాష్ట్ర అటవీశాఖా మంత్రి బొజ్జల గోపాల క్రిష్టా రెడ్డి బుధవారం ఉదయం టీటీడీ ఈవో ఎంజీగోపాల్‌తో కలసి ప్రారంభించారు. మహాభారతం, రామాయణం, భాగవతంలలోని పలు పాత్రలను పూల ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. 
 
ఇది ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బెంగళూరు, చెన్నై, విజయవాడ, సింగపూర్ వంటి ప్రాంతాల నుంచి తెప్పించిన సాంప్రదాయ, సమకాలిన పూలతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన భక్తులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది.
 
ఈ ప్రదర్శనను తయారు చేసిన వారిని మంత్రి బొజ్జల గోపాల క్రిష్ణా రెడ్డి అభినందించారు. వరాహ స్వామి,శ్రీనివాసడి ఘట్టం, క్షీరసాగర మధనం, కూర్మావతారం, అష్టలక్ష్మీ వైభవం, కిష్కిందకాండము, శమంతక మణి, తపోవన లక్ష్మి వంటి ఘట్టాలను పూ ప్రదర్శనతో చాలా చక్కడా చెప్పారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి జేఈవో పోలా భాస్కర్ తదితరులు పాల్గోన్నారు.