బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 30 ఆగస్టు 2018 (14:48 IST)

దేవదేవతలకు వాహనాలివే...

దేవాలయాలు పవిత్రతకు, ప్రశాంతతకు ప్రతీకగా కనిపిస్తుంటాయి. ఏ దేవాలయానికి వెళ్లినా ఆ దైవానికి ఎదురుగా వారి వాహనం కూడా ఉంటుంది. వైష్ణవ ఆలయాల్లో గరుత్మంతుడు, శివాలయాల్లో నందీశ్వరుడు, అమ్మవారి ఆలయాల్లో సింహం వంటి వాహనాలు దర్శనమిస్తుంటారు.

పక్షులను వాహనాలుగా కలిగిన దేవతలు కొంతమంది ఉన్నారు. శ్రీమహావిష్ణువు వాహనంగా గరుడ పక్షి, లక్ష్మీదేవి వాహనంగా గుడ్లగూబ, బ్రహ్మ సరస్వతిదేవి వాహనంగా హంస, కుమారస్వామి వాహనంగా నెమలి, శని దేవుడి వాహనంగా కాకి దర్శనమిస్తుంటారు.