శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 5 సెప్టెంబరు 2014 (19:03 IST)

టమోటా జ్యూస్, చల్లని మంచినీరు తాగినట్లు కల వస్తే?

టమోటా జ్యూస్ తాగినట్లు కలవస్తే? విమానయానం తరచూ చేయుదురు. టమోటా పండు తినుచున్నట్లు కల వచ్చినచో ఎక్కువగా ప్రయాణములు చేసే ఉద్యోగము పొందగలరు. జీడిపప్పు తినుట వలన అనేక విధముల లాభాలు కలుగును. జున్ను కలలో కనిపిస్తే అనేక విధాలా ధనలాభం, అనుకున్న పనులు నెరవేరును. 
 
టీ తాగినట్లు కలవస్తే బంధుమిత్రులతో ఆనందం కలుగును. కప్పులో టీపోసి ఇచ్చినట్లు కలవస్తే నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. చల్లని మంచినీరు తాగినట్లు కలవస్తే మంచిది. వేడినీళ్ళు తాగినట్లు వస్తే పనులకు ఆటంకాలేర్పడుతాయి. 
 
సారాయి, బ్రాంది తక్కువగా త్రాగినట్లు కల వచ్చినట్లైతే మంచిది. కానీ తాగుడు మానేసి మరల తాగినట్లు కల వస్తే మాత్రం కీడు కలుగును. అనేక ఆపదలు కలుగునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా దాహము కలిగినప్పుడు ప్రవాహములో నీరు గానీ, వూటలో వస్తున్న నీటిని గాని త్రాగినట్లు కల వచ్చినట్లైతే రోగములు కలుగును.