మొక్కుబడులు చెల్లించకపోతే దేవుడికి కోపం వస్తుందా?

సిహెచ్| Last Modified మంగళవారం, 30 జులై 2019 (22:14 IST)
సాధారణంగా భక్తులు తమకు ఆపద కలిగినప్పుడు భగవంతునికి మొక్కుకుంటారు. ఆ ఆపద తీరగానే లౌకిక విషయాలలో పడి మొక్కులను మరచిపోతుంటారు. మరి... మొక్కుబడులు చెల్లించకపోతే దేవుడికి కోపం వస్తుందా? తల్లికి బిడ్డల మీద కోపం వస్తుందా? ఇదీ అంతే.

భగవంతుడు ఆశించేది ధర్మ, న్యాయాలతో జీవీతాన్ని గడపమని. మ్రొక్కులు తీసుకుని మన పాపాలని ఆయన స్వీకరించడు. మ్రొక్కుబడులివ్వలేదని కష్టాలు పెట్టడు.ఎవరు చేసిన కర్మలని బట్టి వారు వారి వారి పాపపుణ్యాలను అనుభవించక తప్పదు. కష్టమొస్తే భగవంతునికి మొక్కుకుని, తీరిన తరువాత మరిచిపోయిన వారికి, మళ్లీ కష్టంలో ఆ మ్రొక్కు గుర్తుకు వచ్చి కుటుంబ సమేతంగా ఆ మ్రొక్కు తీర్చుకుంటారు.

భగవంతుడు ఎప్పుడూ మాట మీద, సత్యం మీద నిలిచి ఉండమంటాడు. దానిని మీరితే అది మీ సమస్య గాని భగవంతుని సమస్య కాదు.దీనిపై మరింత చదవండి :