శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 14 ఫిబ్రవరి 2019 (13:38 IST)

ఇంటి నిర్మాణంలో ఎలాంటి రంగులు ఎంపిక చేయాలి..?

రోజురోజుకీ పెరుగుతున్న నాగరికతను అనుగుణంగా భవనాలు నిర్మించడం పరిపాటి అయిన నేపథ్యంలో ఇంటి నిర్మాణంలో రంగుల ఎంపిక చాలా ముఖ్యమని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. ప్రస్తుతం గృహాలు, వాణిజ్య సముదాయాలు రంగుల ఎంపికతో నిర్మించడం ద్వారా చూపరులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే..
 
అయితే కొందరికి ఇంటి నిర్మాణాలలో ఎలాంటి రంగుల్ని ఎంచుకోవాలన్న విషయం సందేహాలు తలెత్తడం సహజమే. రంగులను ఎంచుకోవడం కీలకమని మనిషి పెరుగుదల, పేరు ప్రతిష్టలు అర్జనలో రంగులు కీలక పాత్ర వహిస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. ముఖ్యంగా తెలుపు, నలుపు, ఎరుపు రంగులు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. 
 
వ్యాపార కార్యకలాపాలు వృద్ధిలో నలుపు రంగుతోను, పేరు ప్రఖ్యాతలకు ఎరుపు రంగుతోను అవినాభావ సంబంధం ఉందని వాస్తు శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఒక గృహానికి లేదా వాణిజ్య సముదాయానికి వాడబడే రంగులను బట్టే మనలో ఉత్సాహం, శక్తి పెరుగుతుందని.. అందువలన గృహానికి అనుకూలమైన రంగులు వాడడం కూడా చాలా అవసరమని వాస్తు చెబుతోంది. గృహమే కాకుండా వంటగది, పడకగది, ఆఫీసు గది, పూజగది, బాత్‌రూం ఇలా ఏదైనా కావొచ్చు.. వాటికి ఉపయోగించే రంగులు, అక్కడ ఉండే వ్యక్తుల అభిరుచికి తగినట్టుగా ఉండాలి.