శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2016 (13:13 IST)

దేవాలయాలలో నగ్నశిల్పాలు ఎందుకు చెక్కుతారో తెలుసా?

సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్లినప్పుడు అక్కడ దేవాలయాల మీద ప్రతిమలు, కొన్నినగ్న శిల్పాలు కనిపిస్తాయి. అయితే పరమ పవిత్రమైన దేవాలయంలో ఇలా శిల్పాలు ఎందుకు నగ్నంగా ఉంటాయో చాలామందికి తెలియదు. కాని వాటి వెనుక చాలా అర్ధం, రహస్యాలు వున్నాయి. ఇంతకీ అవేమిటంటే..

సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్లినప్పుడు అక్కడ దేవాలయాల మీద ప్రతిమలు, కొన్నినగ్న శిల్పాలు కనిపిస్తాయి. అయితే పరమ పవిత్రమైన దేవాలయంలో ఇలా శిల్పాలు ఎందుకు నగ్నంగా ఉంటాయో చాలామందికి తెలియదు. కాని వాటి వెనుక చాలా అర్ధం, రహస్యాలు వున్నాయి. ఇంతకీ అవేమిటంటే... పూర్వం సంభోగాన్ని కూడా దైవకార్యంగా చూసేవారట. సంభోగం పవిత్రమైన దైవభక్తికి సూచన.
 
పూర్వం ప్రతి నిత్యం ప్రజలు దేవాలయానికి వెళుతూ దైవ ధ్యానంలో పడి సృష్టి కార్యాన్ని విస్మరించకూడదన్న హెచ్చరిక చేయడానికే ప్రాచీన దేవాలయాల మీద శృంగార భంగిమలను చెక్కించారన్నది ఓ వాదన. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే చతుర్విధములైన పురుషార్థాలను ప్రతి పురుషుడు సాధించాలి అని కచ్చితంగా నియమం ఉండేది.

పురుషార్థమైన అర్థం (ధనం) అంటే ప్రతి పురుషుడు తాను, తన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవితం గడపడానికి అవసరమైనంత ధనం సంపాదించాలి. పురుషార్థమైన కామం అంటే ప్రతి పురుషుడు వివాహం చేసుకుని గృహస్తు ధర్మాలను కచ్చితంగా పాటించాలి.
 
యువకులు ఎక్కువగా దేవాలయాల్లో నిద్రపోయేవారు. వారిలో లైంగిక ప్రవృత్తిని పెంచడానికి దేవాలయాలపై ఇలాంటి శిల్పాలు చెక్కించే వారనే వాదన కూడా ఉన్నది. ''కామి గాక మోక్షగామి కాడు'' అంటే కామి కాని వాడు మోక్షాన్ని పొందలేడు అని. అందుకే దేవాలయాలలో నగ్నశిల్పాలు చెక్కించారని ఓ వాదన ప్రచారంలో ఉన్నది.