శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By WD

శ్మశానంలో భయానక ప్రార్థన

WD PhotoWD
అంతు తెలియని భయానక పద్ధతులతో అర్థరాత్రి వేళలో ప్రకృతిని మరియు పరమాత్ముని ప్రసన్నం చేసుకోవడం పట్ల కొందరికి అపరిమితమైన విశ్వాసం. అటువంటి అసాధారణ పద్దతులు చాలావరకు శ్మశానాలలో జరుగుతుండడాన్ని మనం కనుగొంటాం. ఇటువంటి ప్రార్థనల పట్ల మనలో అనేక సందేహాలు తలెత్తుతూ ఉంటాయి.

ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

సందేహ నివృత్తి కోసం , సేవేంద్రనాధ్ దాదాజీ అనే శ్మశాన తాంత్రికుని మేము కనుగొన్నాము, ఆయన తాంత్రిక గురువు “గురు” తారాపీథ్‌కు శిష్యుడు. తాము మూడు వేర్వేరు పద్ధతులలో ప్రార్ధనలు చేస్తామని ఆయన తెలిపాడు. అవి -“ శ్మశాన సాధన”, “శివసాధన” మరియు “శవ సాధన”. మూడింటిలోనూ క్లిష్టమైనది “శవ సాధన”.
Shruti AgarwalWD


శవ సాధనలో కాలుతున్న శవాన్ని వినియోగిస్తారు. పురుష భక్తుడు స్త్రీ శవాన్ని అలాగే స్త్రీ భక్తురాలు పురుష శవాన్ని సాధనలో ఉపయోగించాలి. ఈ ప్రార్థన పరాకాష్టకు చేరుకోగానే, శవం భక్తుల కోరికలను తీరుస్తుంది. ఈ ప్రక్రియ జరుగుతుండగా, సామాన్య ప్రజలు శ్మశానంలోకి ప్రవేశించరాదు. ఈ ప్రార్థనలు ఉజ్జయినీలోని “తారాపీథ్ శ్మశానం”, “కామాక్య‌పీథ్ శ్మశానం” , “త్రయంబకేశ్వర్ శ్మశానం” మరియు “చక్రతీర్థ శ్మశానాల”లో తరుచుగా జరుగుతుంటాయి.

చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.

Shruti AgarwalWD
శివసాధనలో భక్తుడు శవంపై నిలబడాలి. మిగతా కార్యక్రమమంతా శవ సాధన వలే ఉంటుంది. ఈ పద్ధతి పురాణాలలో పేర్కొనటువంటి కాళికాదేవి, పరమశివుని నిల్చున్న వృత్తాంతం నుంచి గ్రహించబడింది. ఈ పద్ధతిలో భక్తుడు శవానికి మాంసం, మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు. మూడోదైన“శ్మశాన సాధన”లో శవం తాలూకూ కుటుంబ సభ్యులు పాల్గొంటారు. కానీ ఈ ప్రక్రియలో వారు శవాన్ని పూజించరు. ఈ పద్ధతిలో వారు శ్మశానాన్ని పూజించి అనంతరం“ఖోయ”గుజ్జును శవానికి నైవేద్యం పెడతారు.

ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరొక మాంత్రికుడైన చంద్రపాల్ తాను నిర్వహిస్తున్న “శవ సాధన” పద్ధతిలోని కొన్ని భాగాలను వీక్షించేందుకు మమ్మల్ని అనుమతించాడు. ఉజ్జయినీకి దగ్గరగా గల క్షిప్రా నదికి సమీపంలో అతడు “శవసాధన” నిర్వహించాడు. ఈ ప్రక్రియలో తాంత్రికుడు యావత్ శ్మశానాన్ని తన పర్యవేక్షణలో తీసుకొని కొన్ని వాక్యాలను మంద్ర స్థాయిలో వల్లె వేస్తాడు.
Shruti AgarwalWD


శవానికి చెందిన ఆత్మ సరైన దిశలో శ్మశానానికి చేరుకునేందుకుగాను వెలుగుతున్న “దియా” కొవ్వొత్తులను క్షిప్రా నదికి తాంత్రికుడు సమర్పిస్తాడు. అనంతరం తన ప్రార్థనలకు ఇతర ఆత్మల రాకను నిరోధించేందుకు తాంత్రికుడు ఈల వేస్తాడు. శవం చుట్టూ సరిహద్దు గీతలను గీచిన అనంతరం శవంపై నిల్చొని తాంత్రికుడు ప్రార్థనలు చేయడం ప్రారంభిస్తాడు.

చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.

Shruti AgarwalWD
ఈ ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం, భక్తులకు మాంసపు ముక్కలను, మద్యాన్ని తాంత్రికుడు పంచుతాడు. తరువాత తాంత్రికుని అనుచరడు మమ్మల్ని శ్మశానాన్ని వదలి వెళ్ళమని సూచించాడు. ఎందుకంటే ప్రక్రియ పరాకాష్టకు చేరుకున్న తరుణంలో ప్రధాన తాంత్రికుడు దిగంబరుడై శవంపై కూర్చుని ప్రార్థనలు చేపడతాడట.

ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మాలో అనేక సందేహాలు కలుగుతుండగా ఆ ప్రాంతాన్ని వదలి వచ్చేశాము. కానీ ఈ ప్రక్రియ ఆసాంతం మేము కనుగొన్నదేమిటంటే, విభిన్న ప్రపంచానికి చెందిన ఆ వ్యక్తులు అటువంటి గగుర్పొడిచే మరియు భయంకరమైన ప్రార్థనలో పాల్గొనడానికి ఇష్టపడడం.

చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.