సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 1 సెప్టెంబరు 2021 (19:25 IST)

శ్రీవారి ధనప్రసాదం, ఎలా తీసుకోవాలంటే..?

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తుల కోసం సరికొత్త ప్రసాదంను ప్రవేశపెట్టింది. శ్రీవారి ధనప్రసాదం పేరుతో చిల్లర ప్యాకెట్లతో పాటుగా పసుపు కుంకుతో కలిపి భక్తులకు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది టిటిడి.
 
హుండీలో భక్తులు కానుక వేస్తున్న చిల్లర నాణ్యాలను శ్రీవారి ధనప్రసాదంగా అందజేస్తున్నారు. ముఖ్యంగా చిల్లర నాణ్యాలను బ్యాంకులు తీసుకునేందుకు వెనకడుగు వేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది టిటిడి.
 
వంద రూపాయల చిల్లర నాణేలు కలిగిన ప్యాకెట్‌ను సబ్ ఎంక్రైరీ కార్యాలయం వద్ద అందుబాటులో ఉంచింది టిటిడి. ఈ చిల్లర నాణేలను తీసుకునేందుకు చాలామంది భక్తులు ముందుకు వస్తున్నారు. దీనికి అపూర్వ స్పందన లభిస్తోంది.