శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 27 నవంబరు 2014 (19:08 IST)

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎల్ నరసింహన్ గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం మధ్యాహ్నమే చెన్నయ్ నుంచి తిరుపతి చేరుకున్న ఆయన సాయంత్రమే తిరుమలకు వెళ్ళారు. వేకువ జామునే తన సతీమణి విమలా నరసింహన్ తో కలసి వేంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేశారు. అక్కడ ఆలయ అధికారులు వారికి సాదర స్వాగతం పలికారు.

 
వేదపండితులు, ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి చిన్నంగారి రమణ ఆయనను ఆలయంలోకి తీసుకెళ్ళారు. దర్శనం చేసుకున్న అనంతరం రంగనాయక మండపంలో ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. 
 
పద్మావతీ అమ్మవారి సేవలో గవర్నర్ 
పంచమి తీర్థం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎల్ నరసింహన్ గురవారం మధ్యాహ్నం తిరుచానూరు పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు. పంచమి తీర్థం కార్యక్రమంలో పాల్గొనడానికి నరసింహన్ సతీసమేతంగా తిరుచానూరు విచ్చేశారు. పంచమి తీర్థం కార్యక్రమాన్ని తిలకించిన తరువాత అమ్మవారి దర్శనం చేసుకున్నారు. 

 
దర్శన సమయంలో ఆయనతోపాటు ఈవో ఎంజీగోపాల్ తదితరులు దగ్గరే ఉన్నారు. ఈ కార్యక్రమంలో జేఈవోలు, శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, డిప్యూటీ ఈవో చెంచు లక్ష్మి తదితరులు ఉన్నారు. దర్శనం అనంతరం గవర్నర్ ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.